For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: గంభీర్ నా గుండెను టచ్ చేసాడు.. మాజీ క్రికెటర్ భావోద్వేగం!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన పనికి మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ మురళీ కార్తీక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గంభీర్ చేసిన పని తన మనస్సును హత్తుకుందని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) విధ్వంసంతో 11.5 ఓవర్లలోనే చేధించింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ, ఐపీఎల్ సంచలనం, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు.

IND vs BAN Murali Kartik Shares Heartfelt Post On Gautam Gambhir s Gesture Before 1st T20I

మ్యాచ్‌కు ముందు మురళీ కార్తీక్ చేతుల మీదుగా మయాంక్ యాదవ్, పార్దీవ్ పటేల్ చేతుల మీదుగా నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్ర క్యాప్‌లు అందుకున్నారు. అయితే ఈ సంఘటన తన అరంగేట్రాన్ని గుర్తు చేసిందని మురళీ కార్తీక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా గంభీర్‌కు ధన్యవాదాలు చెబుతూ తన అరంగేట్రాన్ని మురళీ కార్తీక్ గుర్తు చేసుకున్నాడు.

25 ఏళ్ల క్రితం తాను సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నానని మురళీ కార్తీక్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 'పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌కు ఇది మరిచిపోలేని రోజు. ఈ ఘటన నన్ను 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్‌ల చేతుల మీదుగా నేను అందుకున్న అరంగేట్ర క్యాప్ సందర్భాన్ని గుర్తు చేసింది.

అరంగేట్ర క్యాప్ అందివ్వాలని గంభీర్ అడగడం నా మనస్సును హత్తుకుంది. గంభీర్ నుంచి ఇదో అద్భుతమైన పని.'అని మురళీ కార్తీక్ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌కు మయాంక్ యాదవ్‌కు అరంగేట్ర క్యాప్ అందిస్తున్న ఫొటోను జత చేశాడు. దేశం తరఫున ఆడటానికి మించిన అనుభూతి మరొకటి లేదని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే మయాంక్ యాదవ్ దుమ్మురేపాడు. మెయిడిన్ ఓవర్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. తన రెండో ఓవర్‌లో బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లాను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు.

Story first published: Monday, October 7, 2024, 22:23 [IST]
Other articles published on Oct 7, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+