Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: హార్దిక్ పాండ్యా బౌలింగ్‌పై టీమిండియా కోచ్ అసంతృప్తి!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ అనంతరం భారత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. ఆదివారం నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

ఈ సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియాతో కలిసిన హార్దిక్ పాండ్యా.. తొలి టీ20 వేదికైన గ్వాలియర్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన హార్దిక్ పాండ్యా.. గంటల కొద్దీ నెట్స్‌లో బంతులు వేసాడు.

IND vs BAN Morne Morkel Unhappy With Hardik Pandya s Bowling In Nets Report

మోర్నీ మోర్కెల్ అసంతృప్తి..
టీమిండియా నయా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను పర్యవేక్షించాడు. అయితే హార్దిక్ బౌలింగ్ తీరుపై మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బౌలింగ్ విషయంపై హార్దిక్ పాండ్యాతో మోర్నీ మోర్కెల్ సుదీర్ఘంగా చర్చించాడని.. బౌలింగ్ శైలిలో కాస్త మార్పు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

హార్దిక్ పాండ్యా స్టంప్స్‌కు దగ్గరగా వెళ్లి బంతులు వేస్తున్నాడని గుర్తించి మోర్నీ మోర్కెల్.. పలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు సలహాలు ఇచ్చిన అనంతరం మోర్నీ మోర్కెల్ యువ పేసర్ల ప్రాక్టీస్‌ను పర్యవేక్షించాడు.

స్పెషల్ అట్రాక్షన్‌గా మయాంక్ యాదవ్...
ఐపీఎల్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఈ టీ20 సిరీస్‌కు ఎంపికవ్వగా.. అతను ప్రధాన ఆకర్షణగా మారాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులేసి అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ యాదవ్.. గాయంతో భారత్ తరఫున ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకొని బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అతనితో పాటు మరో యువ పేసర్ హర్షిత్ రాణా కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ కూడా ముమ్మరంగా సాధన చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా.. బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడిన ఆటగాళ్లను టీ20 సిరీస్‌కు దూరంగా ఉంచారు. దాంతో కుర్రాళ్లతో కూడిన జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపించనున్నాడు.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్‌కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

Story first published: Friday, October 4, 2024, 14:11 [IST]
Other articles published on Oct 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+