Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: చరిత్ర సృష్టించిన మహమ్మద్ షమీ.. జహీర్ ఖాన్ రికార్డ్ బద్దలు!

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. బంతులపరంగా ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో దుబాయ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

తొలి బౌలర్‌గా..
ఈ మ్యాచ్‌లో జాకెర్ అలీని క్యాచ్ ఔట్ చేయడం ద్వారా మహమ్మద్ షమీ 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 104 వన్డేల్లో మహమ్మద్ షమీ 200 వికెట్లను తీయగా.. మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ట్రెంట్ బౌల్ట్(107 మ్యాచ్‌లు), బ్రెట్‌లీ(112), అలన్ డోనాల్డ్(117) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. బంతుల పరంగా మాత్రం మహమ్మద్ షమీనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించాడు.

IND vs BAN Mohammed Shami Creates History As Becomes India s Most Successful Bowler In ICC Tournaments

అతను 5126 బంతులు వేసి 200 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ 5240 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించాడు. సక్లెయిన్ ముష్తాక్(5451), బ్రెట్ లీ(5640), ట్రెంట్ బౌల్ట్(5783), వకార్ యూనిస్(5883) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

జహీర్ ఖాన్ రికార్డ్ బద్దలు..
ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో మహమ్మద్ షమీ 72 వికెట్లతో టాప్‌ ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను జహీర్ ఖాన్ రికార్డ్‌ను అధిగమించాడు. 18 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 55 వికెట్లు తీసిన షమీ.. 14 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న షమీ 3 వికెట్లు తీసి మొత్తం 33 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.

జహీర్ ఖాన్ 44 ఐసీసీ టోర్నీ మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసాడు. జస్‌ప్రీత్ బుమ్రా(68 వికెట్లు), రవీంద్ర జడేజా(65), రవిచంద్రన్ అశ్విన్(59) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Story first published: Thursday, February 20, 2025, 18:01 [IST]
Other articles published on Feb 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+