Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: నిప్పులు చెరిగిన మయాంక్ యాదవ్.. మెయిడిన్ ఓవర్‌తో షురూ..!

టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మయాంక్ యాదవ్.. తనపై టీమిండియా మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గంటకు 149 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు.

మెయిడిన్ ఓవర్‌‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. పవర్ ప్లేలో చివరి ఓవర్‌కు బంతిని అందుకున్న మయాంక్ యాదవ్.. గంటకు 141.8, 145.7, 137.9, 147.3, 135.1, 148 కిలోమీటర్ల వేగంతో ఆరు బంతులను మెయిడిన్ వేసాడు. అతని వేగవంతమైన బంతులను బంగ్లాదేశ్ బ్యాటర్ టౌహిడ్ హృదయ్ టచ్ చేయలేకపోయాడు. దాంతో ఈ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా రాలేదు. తన అంతర్జాతీయ కెరీర్‌ను మయాంక్ యాదవ్ మెయిడిన్ ఓవర్‌తో ప్రారంభించాడు.

IND vs BAN Mayank Yadav Starts His T20I Career With A Maiden Over In The Powerplay

వేగవంతమైన బంతులతో పాటు వేరియేషన్స్ చూపిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో మెయిడిన్ ఓవర్‌తో కెరీర్‌ను ప్రారంభించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. మయాంక్ యాదవ్ కంటే ముందు అజిత్ అగార్కర్(2006లో సౌతాఫ్రికాతో), అర్ష్‌దీప్ సింగ్(2022లో ఇంగ్లండ్‌తో) మెయిడిన్ ఓవర్‌తో తమ కెరీర్లను ప్రారంభించారు.

తన మరసటి ఓవర్‌లోనూ అదే జోరు కనబర్చిన మయాంక్ యాదవ్.. రెండో బంతికి మహ్మదుల్లా(1)ను ఔట్ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో ఖాతా తెరిచాడు. ఈ ఓవర్‌లో అతను మూడు పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున సంచలన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ యాదవ్.. గాయంతో నాలుగు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.

అతని పేస్‌, వేరియేషన్స్‌కు ఫిదా అయిన బీసీసీఐ.. ఎన్‌సీఏలో చేర్చి మెరుగైన చికిత్స అందించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్ సాధించడంతో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసింది. అతను ఇదే జోరులో బౌలింగ్ చేస్తే టీమిండియాలో రెగ్యులర్ పేసర్‌గా మారే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మయాంక్ యాదవ్‌ను బీసీసీఐ సిద్దం చేస్తోంది.

Story first published: Sunday, October 6, 2024, 20:05 [IST]
Other articles published on Oct 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+