Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: రఫ్ఫాడించిన బౌలర్లు.. భారత్ లక్ష్యం ఎంతంటే..?

ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌‌కు అనుకూలంగా ఉన్న ఫ్లాట్ వికెట్‌పై బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా(2/33) మహమ్మద్ సిరాజ్(2/60), రవీంద్ర జడేజా(2/38) సూపర్ బౌలింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులే చేసింది.

ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్లా(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), ముష్ఫికర్ రహీమ్(46 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజాకు తోడుగా.. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.

IND vs BAN: Mahmudullah, Litton help Bangladesh post 256/8 vs India

భారత్ తప్పిదం.. అదిరిపోయే ఆరంభం..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తన్జిద్ హసన్, లిటన్ దాస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించిన ఈ జోడీ.. క్రీజులో సెట్ అయిన తర్వాత ఎదురు దాడికి దిగింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 5వ ఓవర్‌లో తన్జిద్ హసన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

ఈ ఓవర్‌లో తన్జిద్ వికెట్ల ముందు దొరికిపోగా.. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయలేదు. రిప్లేలో ఇది క్లియర్ ఔట్‌గా తేలింది. ఈ అవకాశంతో అతను చెలరేగగా.. బంగ్లాదేశ్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. అనంతరం తన్జిద్‌కు మరో లైఫ్ లభించింది. శార్దూల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్‌లో తన్జిద్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అతను అందుకోలేకపోయాడు.

IND vs BAN: Mahmudullah, Litton help Bangladesh post 256/8 vs India

దెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్
ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అతను 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 93 పరుగులు భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. తన్జిద్ హసన్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే లిటన్ దాస్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. నజ్ముల్ హోస్సెన్ షాంటో(8)ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

సిక్సర్‌తో ముగింపు..
ఆ వెంటనే రాహుల్ సూపర్ క్యాచ్‌కు మెహ్‌దీ హసన్(3) వెనుదిరగ్గా.. ధాటిగా ఆడుతున్న లిటన్ దాస్‌ను జడేజా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన టౌహిడ్ హృదయ్(16)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయగా.. నిలకడగా ఆడుతున్న ముష్పికర్ రహీమ్‌ను జడేజా స్టన్నింగ్ క్యాచ్ సాయంతో బుమ్రా పెవిలియన్ చేర్చాడు.

నసమ్ అహ్మద్(14)ను సిరాజ్ ఔట్ చేయగా.. మహమ్మదుల్లా సూపర్ బ్యాటింగ్‌తో బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని చివరి ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కళ్లు చెదిరే యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ బాదిన షోరిఫుల్ ఇస్లామ్.. బంగ్లా ఇన్నింగ్స్‌కు మంచి ముగింపు ఇచ్చాడు.

Story first published: Thursday, October 19, 2023, 18:14 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+