Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక దూకుడే.. బంగ్లా బౌలర్లను దంచికొట్టుడే.. అదే మా మంత్రం: కేఎల్ రాహుల్

Ind vs Ban: KL Rahul says We have to play aggressive cricket to qualify for WTC Final 2023

చట్టోగ్రామ్‌‌: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023 ఫైనల్ బెర్త్ దక్కాలంటే బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో దూకుడుగా ఆడటం తప్ప మరో ఆప్షన్ లేదని టీమిండియా తాత్కలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. బుధవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌‌ మొదలవనుండగా, గాయాల కారణంగా కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ, పేసర్లు బుమ్రా, షమీ, స్పిన్నర్‌‌ రవీంద్ర జడేజా లేకుండానే ఇండియా బరిలోకి దిగుతోంది. రోహిత్‌‌ ప్లేస్‌‌లో రాహుల్‌‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. సోమవారం బంగ్లా కెప్టెన్​ షకీబ్​తో కలిసి సిరీస్‌‌ ట్రోఫీ ఆవిష్కరించిన తర్వాత రాహుల్‌‌ మీడియాతో మాట్లాడాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కాలంటే..?

'వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఉంది కాబట్టి మేం దూకుడుగా ఆడాల్సిందే. ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో.. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఏం చేయాలో తెలుసు. ప్రతి రోజు, ప్రతి సెషన్‌‌లో నిర్దిష్ట సమయంలో టీమ్‌‌కు ఏం అవసరమో అంచనా వేస్తూ మా బెస్ట్‌‌ ఇస్తాం. అంతే తప్ప ప్రత్యేకంగా ఓ మైండ్‌‌సెట్‌‌తోనే ఆడం. దూకుడుగా, ధైర్యంగా ఆడి రిజల్ట్‌‌ వచ్చేలా చేస్తాం. ఐదు రోజుల మ్యాచ్‌‌ కాబట్టి చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని ముందుకెళ్లడం ముఖ్యం. ప్రతి సెషన్‌‌లో డిమాండ్లు భిన్నంగా ఉంటాయి. కానీ, మా నుంచి చాలా దూకుడైన క్రికెట్‌‌ చూస్తారని కచ్చితంగా చెప్పగలను.

 డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కాలంటే..?

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కాలంటే..?

'వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఉంది కాబట్టి మేం దూకుడుగా ఆడాల్సిందే. ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో.. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఏం చేయాలో తెలుసు. ప్రతి రోజు, ప్రతి సెషన్‌‌లో నిర్దిష్ట సమయంలో టీమ్‌‌కు ఏం అవసరమో అంచనా వేస్తూ మా బెస్ట్‌‌ ఇస్తాం. అంతే తప్ప ప్రత్యేకంగా ఓ మైండ్‌‌సెట్‌‌తోనే ఆడం. దూకుడుగా, ధైర్యంగా ఆడి రిజల్ట్‌‌ వచ్చేలా చేస్తాం. ఐదు రోజుల మ్యాచ్‌‌ కాబట్టి చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకొని ముందుకెళ్లడం ముఖ్యం. ప్రతి సెషన్‌‌లో డిమాండ్లు భిన్నంగా ఉంటాయి. కానీ, మా నుంచి చాలా దూకుడైన క్రికెట్‌‌ చూస్తారని కచ్చితంగా చెప్పగలను.

ఇంగ్లండ్ కాన్సెప్ట్ బాగుంది..

ఇంగ్లండ్ కాన్సెప్ట్ బాగుంది..

ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ చూసేందుకు ఆసక్తికరంగా ఉంది. భయం లేని దృక్పథంతో ఆడటాన్ని ఆస్వాదిస్తున్నా. ప్రతి జట్టుకు ఒక సొంత దృక్పథం ఉంటుంది. బాగా ఆడుతున్న జట్ల నుంచి ఒకటి, రెండు విషయాలు నేర్చుకోవచ్చు'' అని చెప్పాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు రిషభ్ పంత్‌ స్థానంలో పుజారాకు వైస్‌ కెప్టెన్సీ అప్పగించడంపై స్పందిస్తూ.. ''జట్టు వైస్‌ కెప్టెన్‌ ఎంపిక విధానం గురించి నాకు తెలియదు. వైస్‌ కెప్టెన్‌ ఎవరైనా జట్టులో పెద్దగా మార్పుండదు. జట్టులో తమ పాత్ర, బాధ్యత గురించి ప్రతి ఒక్కరికి తెలుసు'అని రాహుల్‌ సమాధానమిచ్చాడు. కెప్టెన్‌‌ రోహిత్‌‌ గాయం నుంచి కోలుకొని రెండో టెస్టు వరకు అందుబాటులోకి వస్తాడని రాహుల్‌‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ముమ్మరంగా సాధన..

ముమ్మరంగా సాధన..

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో నిలవాలంటే మిగతా ఆరు టెస్టు (బంగ్లాతో 2, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 4)ల్లో టీమిండియా కనీసం అయిదు గెలవాల్సిన అవసరముంది. ప్రస్తుతం పట్టికలో 52.08 పాయింట్ల శాతంతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఆసీస్‌ (75), దక్షిణాఫ్రికా (60), శ్రీలంక (53.33) వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు తొలి టెస్టు కోసం టీమిండియా మొదటి ప్రాక్టీస్ సెషన్‌‌లో పాల్గొంది. కేఎల్‌‌ రాహుల్‌‌, పంత్‌‌, గిల్‌‌ సహా బ్యాటర్లంతా నెట్స్‌‌లో చెమటలు చిందించారు. గ్రౌండ్‌‌లో ఫీల్డింగ్‌‌ డ్రిల్స్‌‌ కూడా చేశారు.

Story first published: Tuesday, December 13, 2022, 8:10 [IST]
Other articles published on Dec 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+