IND vs BAN: 12 ఏళ్ల తర్వాత భారత టెస్ట్ టీమ్‌లో చోటు.. చీకటి కడుపును చీల్చుకుంటూ..!

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ పేసర్, దేశవాళీ ఛాంపియన్ జయదేవ్ ఉనాద్కత్ మళ్లీ టెస్ట్ టీమ్ పిలుపు అందుకున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఆడే రెండు టెస్ట్‌ల సిరీస్‌కు జయదేవ్ ఉనాద్కత్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. భుజ గాయంతో ఈ పర్యటనకు దూరమైన స్టార్ మహమ్మద్ షమీ స్థానాన్ని ఉనాద్కత్‌తో భర్తీ చేసింది.
బంగ్లాదేశ్ పర్యటనకు ముందే షమీ గాయంతో జట్టుకు దూరం కాగా.. వన్డేలకు అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేశారు. అయితే టెస్ట్ సిరీస్‌కు షమీ స్థానంలో భారత్-ఏ తరఫున బంగ్లాదేశ్ పర్యటనలో అదరగొట్టిన నవ్‌దీప్ సైనీ, ముఖేశ్ కుమార్‌లకు అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపిన జయదేవ్ ఉనాద్కత్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది.

విజయ్ హజారే విజేతగా..
10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసిన ఉనాద్కత్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన అద్భుత ప్రదర్శనతో కెప్టెన్‌గా సౌరాష్ట్రను విజయ్ హజారే ట్రోఫీ చాంపియన్‌గా నిలబెట్టాడు. 2019-20 రంజీ ట్రోఫీలో 67 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 353 వికెట్లు తీసాడు. 12 ఏళ్ల క్రితం 2010లో సౌతాఫ్రికాతో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉనాద్కత్.. మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం అందుకున్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో అతనికి గనుక తుది జట్టులో అవకాశం దక్కితే.. సుదీర్ఘ కాలం తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రిఎంట్రీ ఇచ్చిన భారత తొలి ప్లేయర్‌గా రికార్డుకెక్కనున్నాడు.

తొలి క్రికెటర్‌గా..
ఈ ఘనత మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్ పేరు మీద ఉంది. పార్దీవ్ పటేల్ 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి కమ్ బ్యాక్ చేశాడు. అయితే జయదేవ్ ఉనాద్కత్ ఎంపికపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ ఫో, క్రిక్ బజ్‌తో పాటు ఉనాద్కత్ తన ఎంపి విషయాన్ని ధృవీకరించారు. 'రాజ్ కోట్‌లో ఉన్న ఉనాద్కత్.. వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరో రెండు రోజుల్లో చటోగ్రామ్‌లోని భారత టెస్ట్ జట్టుతో కలుస్తాడు'అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తెలిపింది.
ఉనాద్కత్ సైతం..
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఉనాద్కత్ సైతం టెస్ట్ టీమ్ పిలుపును పరోక్షంగా ప్రస్తావిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక జయదేవ్ ఉనాద్కత్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. దేశవాళీ సంచలన ప్రదర్శనతో భారత జట్టులోకి వస్తున్న ఉనాద్కత్.. అత్యున్నత స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఐపీఎల్‌లోనూ భారీ ధర పలికిన అతను నిలకడగా రాణించలేకపోయాడు. ఈసారైన మెరుగైన ప్రదర్శన చేసి అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడో లేదో చూడాలి.

రోహిత్ గాయంపై..
ఇక గాయంతో దూరమైన రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్, రవీంద్ర జడేజా స్థానంలో సౌరభ్ కుమార్‌లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే మెరుగైన చికిత్స కోసం ముంబై వచ్చిన రోహిత్ శర్మ గాయంపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత బీసీసీఐ ఈ మార్పులు చేర్పుల ప్రకటన చేయనుంది. రోహిత్ రెండో టెస్ట్ వరకు అందుబాటులో ఉంటాడనే వార్తల నేపథ్యంలో వేచి చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications