IND vs BAN: భారత్ ఘన విజయం.. ఇషాన్ కిషన్ స్కోర్‌ను కూడా అందుకోలేకపోయిన బంగ్లాదేశ్!

ఛటోగ్రామ్: బంగ్లాదేశ్ పర్యటనలో ఎట్టకేలకు టీమిండియా విజయాన్నందుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా.. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో అద్భుత విజయాన్నందుకుంది. ఏకపక్షంగా సాగిన నామమాత్రపు చివరి వన్డేలో సమష్టిగా రాణించిన రాహుల్ సేన.. 227 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. చివరి మ్యాచ్‌లో ఓడినా.. బంగ్లాదేశ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) డబుల్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 113) సెంచరీతో రాణించాడు.

ఇషాన్ 210.. బంగ్లా 182..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 34 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. షకీబ్ అల్ హసన్(43) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు. ఇషాన్ కిషన్ చేసిన 210 పరుగులను కూడా బంగ్లాదేశ్ బ్యాటర్లు చేయలేకపోయారు.

ఆరంభం నుంచే..
410 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అనముల్ హక్(8).. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే కెప్టెన్ లిటన్ దాస్(29)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో బంగ్లాదేశ్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. అనంతరం మరింత కట్టడిగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసారు. ముష్ఫికర్ రహీమ్(7)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. యాసిర్ అలీ(25)ని ఉమ్రాన్ మాలిక్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.

షకీబ్ ఒక్కడే..
హాఫ్ సెంచరీకి చేరువైన షకీబ్ అల్ హసన్(43)ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. సిక్సర్‌తో జోరు కనబర్చిన మహ్మదుల్లాను సుందర్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో బంగ్లాదేశ్ 143 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ వరుస ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. అఫిఫ్ హోస్సెన్(8), మెహ్‌దీ హసన్(3), ఎబాదత్ హోస్సెన్(0)లను పెవిలియన్ చేర్చాడు. టస్కిన్ అహ్మద్(17 నాటౌట్)3 భారీ సిక్సర్లతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. అయితే ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత విజయ లాంఛనం పూర్తయ్యిం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications