Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: టీమిండియాను ఊరిస్తున్న 92 ఏళ్ల రికార్డ్..!

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించబోతుంది. దాదాపు 45 రోజుల విశ్రాంతి అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియాకు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షి 2023-25 ఫైనల్‌కు ముందు ఈ మ్యాచ్‌తో కలిసి భారత్ 10 టెస్ట్‌లు ఆడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు కావాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. అంతేకాకుండా రోహిత్ సేనను 92 ఏళ్ల టెస్ట్ రికార్డ్ ఊరిస్తోంది. 1932 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్న టీమిండియా.. ఇప్పటి వరకు 579 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 178 సార్లు సమానంగా గెలుపు, ఓటములు నమోదు చేసిన భారత్.. 222 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

IND vs BAN India Set To Create History against Bangladesh For First Time In 92 Years

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. 179వ విజయం నమోదు అవుతుంది. అప్పుడు ఓటముల సంఖ్యను అధిగమిస్తోంది. 92 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే టీమిండియా ఎక్కువ విజయాలు నమోదు చేసినట్లు అవుతోంది. ఇప్పటికే చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రిషభ్ పంత్ రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్ ఉద్వాసనకు గురయ్యాడు. కేఎల్ రాహుల్ సైతం చోటు దక్కించుకున్నాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(కీపర్), ధ్రువ్ జురెల్(కీపర్), ఆర్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్

Story first published: Friday, September 13, 2024, 21:10 [IST]
Other articles published on Sep 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+