For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: టీమిండియా చెత్త రికార్డ్!

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. వన్డే ఫార్మాట్‌లో వరుసగా అత్యధిక మ్యాచ్‌ల్లో టాస్ ఓడిన జట్టుగా నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ చెత్త రికార్డ్ ఇప్పటి వరకు నెదర్లండ్స్ పేరిట ఉండగా.. తాజాగా టీమిండియా సమం చేసింది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌తో సహా టీమిండియా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది.

ఈ 11 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 8 సార్లు టాస్ ఓడగా.. మరో మూడు సార్లు కేఎల్ రాహుల్ టాస్ గెలవలేదు. నెదర్లాండ్స్ జట్టు 2011-2014 మధ్య వరుసగా 11 మ్యాచ్‌ల్లో టాస్ ఓడింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడితే ఈ చెత్త రికార్డ్‌ను తమ పేరిట లిఖించుకోనుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో మూడు వన్డేలు ఆడింది. ఈ సిరీస్‌లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించాడు. అతను మూడు మ్యాచ్‌ల్లో టాస్ ఓడాడు.

IND vs BAN India Creates Unwanted Record In Champions Trophy Opener against Bangladesh

15 నెలలుగా టాస్ గెలవలేదు..
ఆ తర్వాత శ్రీలంకతో గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో మూడు వన్డేలు ఆడిన టీమిండియా.. మూడింటిలో టాస్ గెలవలేదు. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన మూడు వన్డేల్లోనూ టీమిండియా టాస్ గెలవలేదు. గత 10 మ్యాచ్‌ల్లో టీమిండియా 5 మ్యాచ్‌లు విజయం సాధించింది. టీమిండియా చివరి సారిగా వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టాస్ గెలిచింది. దాదాపు 15 నెలలుగా టాస్ గెలవలేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ ఉండటంతో టీమిండియా మూడే వన్డేలు ఆడింది. దాంతో ఈ చెత్త ఫీట్‌ను తమ పేరిట లిఖించుకుంది.

నిప్పులు చెరిగిన షమీ, హర్షిత్ రాణా..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్‌ చేయడంతో బంగ్లా 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సౌమ్య సర్కార్(0), నజ్ముల్ హోస్సెన్ షాంటో(0), మెహ్‌దీ హసన్ మిరాజ్(5) పెవిలియన్ చేరారు.

Story first published: Thursday, February 20, 2025, 15:17 [IST]
Other articles published on Feb 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+