Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసియా రికార్డ్ బద్దలు!

టీమిండియా చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) విధ్వంసంతో 11.5 ఓవర్లలోనే చేధించింది.

ధనాధన్ బ్యాటింగ్‌తో టీమిండియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్‌పై అత్యధిక పవర్ ప్లే స్కోర్ నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. సంజూ శాంసన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 29), సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29)అటాకింగ్ గేమ్‌తో టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.

IND vs BAN India Create History In 1st T20I against Bangladesh BREAK Asian Games Record

టీ20ల్లో బంగ్లాదేశ్‌పై ప్రత్యర్థి జట్టు సాధించిన అత్యధిక పవర్ ప్లే స్కోర్ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో టీమిండియా తమ రికార్డులనే అధిగమించింది. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలోని టీమిండియా.. పవర్ ప్లేలో 68/1 స్కోర్ చేసింది. 2019లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. బంగ్లాదేశ్‌పై పవర్ ప్లేలో 63/0 స్కోర్ నమోదు చేసింది.

తాజాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా... ఈ రెండు పవర్ ప్లే స్కోర్ల రికార్డులను అధిగమించి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. అంతేకాకుండా టీ20 క్రికెట్‌లో 100 ప్లస్ టార్గెట్‌ను అత్యధిక బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన జట్టుగానూ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 49 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. 2016లో జింబాబ్వేపై 41 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. తాజా ఈ రికార్డ్‌ను సూరీడి సేన అధిగమించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్‌దీ హసన్ మీరాజ్(32 బంతుల్లో 3 ఫోర్లతో 35 నాటౌట్), నజ్ముల్ హెస్సేన్ షాంటో(25 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/31)‌, అర్ష్‌దీప్ సింగ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్యా(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 29), సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడారు. హార్దిక్ పాండ్యాతో కలిసి తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(16 నాటౌట్) అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లు తలో వికెట్ తీసారు.

Story first published: Monday, October 7, 2024, 16:11 [IST]
Other articles published on Oct 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+