టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అత్యధిక రన్‌రేట్ నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఈ ఫీట్ సాధించింది.
ఫలితం అసాధ్యమనుకున్న ఈ మ్యాచ్‌లో అటాకింగ్ అప్రోచ్‌తో టీమిండియా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో టీమిండియా 7.36 రన్ రేట్ నమోదు చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా రికార్డ్‌ను బద్దలు కొట్టింది.

సఫారీ రికార్డ్ బ్రేక్..
2005లో జింబాబ్వేతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు ఇన్నింగ్స్‌ల్లో 6.80 రన్ రేట్ నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ కాగా.. తాజాగా భారత్ 7.36 రన్‌రేట్‌తో అధిగమించింది. ఈ జాబితాలో ఇంగ్లండ్(6.73), (6.43), (5.73) రన్ రేట్స్‌తో తర్వాతి స్థానాల్లో కొనసాగుతోంది.
2022లో రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6.73 రన్ రేట్ నమోదు చేసింది. 2023లో లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 6.43 రన్ రేట్, 2005లో బంగ్లాదేశ్‌తో 5.73 రన్ రేట్‌తో పరుగులు చేసింది.
నాలుగో జట్టుగా భారత్..
టెస్ట్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో జట్టుగా టీమిండియా నిలిచింది. 180 విజయాలతో ఈ జాబితాలోని సౌతాఫ్రికాను వెనక్కినెట్టింది. 414 విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 397 విజయాలతో ఇంగ్లండ్, 183 విజయాలతో వెస్టిండీస్ భారత్ కంటే ముందున్నాయి.
అత్యధిక సిరీస్ విజయాలు..
సొంతగడ్డపై వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్‌లు గెలిచిన జట్టుగానూ టీమిండియా రికార్డ్ సాధించింది. 2013 నుంచి 2024 మధ్య టీమిండియా వరుసగా 18 టెస్ట్ సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఈ జాబితాలో భారత్ తర్వాత ఆస్ట్రేలియా(1994-2000 మధ్య 10 టెస్ట్ సిరీస్ విజయాలు), (2004-2008 మధ్య 10 టెస్ట్ సిరీస్ విజయాలు) ఉండగా.. వెస్టిండీస్(1976-1986 మధ్య 8 సిరీస్ విజయాలు), న్యూజిలాండ్(2017-2020 మధ్య 8 సిరీస్ విజయాలు) నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
తక్కువ బంతులతో విజయం..
టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ బంతులు ఎదుర్కొన్న విజయం సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా మొత్తం 281 బంతులు మాత్రమే ఎదుర్కొంది. ఈ జాబితాలో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. 1935లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 276 బంతుల్లోనే గెలుపొందింది.