
టాపార్డర్ విఫలమైనా..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో అనుముల్ హక్(11) ఎల్బీగా వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌లో రోహిత్ శర్మ రూపంలో అతనికి లైఫ్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అనుముల్ హక్ ఇచ్చిన స్లిప్ క్యాచ్ అందుకునే క్రమంలో రోహిత్ బొటన వేలికి గాయమైంది.
దాంతో అతను మైదానం వీడగా.. కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు. క్రీజులోకి వచ్చిన నజ్ముల్ హెస్సెన్ షాంటో(21)తో పాటు కెప్టెన్ లిటన్(7) తీవ్రంగా తడబడ్డారు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ ఆడటానికి వణికిపోయారు. 9వ ఓవర్‌లో సిరాజ్.. లిటన్ దాస్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో బంగ్లాదేశ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 44 పరుగులు చేసింది.

ఆదుకున్న మెహ్‌దీ హసన్..
అనంతరం ఉమ్రాన్ మాలిక్ 151 కిలోమీటర్ల స్టన్నింగ్ డెలవరీతో నజ్ముల్‌ను పెవిలియన్ చేర్చగా.. వాషింగ్టన్ సుందర్ తన వరుస ఓవర్లలో షకీబ్ అల్ హసన్(8), ముష్ఫికర్ రహీమ్(12), అఫిఫ్ హోస్సెన్(0)లను ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారత బౌలర్ల జోరు ముందు బంగ్లా కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ మెహ్‌దీ హసన్ మీర్జా మరోసారి జట్టును ఆదుకున్నాడు. తొలి వన్డేలో అద్భుత విజయాన్నందించిన మెహ్‌దీ హసన్ అదే ఆత్మ విశ్వాసంతో మహ్మదుల్లాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

విధ్వంసకర బ్యాటింగ్‌తో..
క్రీజులో కుదురుకునే వరకు నిదానంగా ఆడిన ఈ జోడీ.. ఆ తర్వాత భారత బౌలర్లపై విరుచుకుపడింది. రాహుల్ బౌలర్లు.. ఫీల్డింగ్ మార్చినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ముందుగా మెహ్‌దీ హసన్ హాఫ్ సెంచరీ చేసుకోగా.. ఆ తర్వాత మహ్మదుల్లా కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.
148 పరుగుల భాగస్వామ్యం అనంతరం మహ్మదుల్లా.. సుందర్ బౌలింగ్‌లో ఔటవ్వగా.. జట్టులోకి వచ్చిన నసుమ్ అహ్మద్‌తో కలిసి మెహ్‌దీ హసన్ భారీ స్కోర్ అందించాడు. శార్దూల్ వేసిన ఆఖరి ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లతో మెహ్‌దీ హసన్ సెంచరీ అందుకున్నాడు.


Click it and Unblock the Notifications
