టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. క్రీజులోకి వచ్చిన ప్రతీ ఒక్కరు దూకుడుగా ఆడటంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది.
హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(24 బంతుల్లో 3 సిక్సర్లతో 34), విరాట్ కోహ్లీ(28 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 37), రిషభ్ పంత్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్(2/32), రిషద్ హొస్సేన్(2/43) రెండేసి వికెట్లు తీయగా.. షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ తీసాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూకుడైన ఆరంభాన్ని అందించారు. దాంతో టీమిండియా 3.4 ఓవర్లలోనే 39 పరుగులు చేసింది. 3 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చిన రోహిత్ శర్మ అదే జోరులో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
క్రీజులోకి రిషభ్ పంత్ రాగా.. విరాట్ కోహ్లీ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. కోహ్లీ తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతని జోరుకు తంజిమ్ హసన్ షకీబ్ బ్రేక్ వేసాడు. స్టన్నింగ్ డెలివరీతో కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు.
అదే ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి శివమ్ దూబే రాగా.. పంత్ తనదైన శైలిలో చెలరేగాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతను కూడా అదే జోరులో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు రాగా.. శివమ్ దూబే తనదైన శైలిలో చెలరేగాడు.
ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురు దాడికి దిగి భారీ సిక్సర్లు బాదాడు. కానీ అతని జోరుకు రిషద్ హొస్సేన్ బ్రేక్ వేసాడు. సూపర్ బాల్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. అక్షర్ పటేల్ సాయంతో దూకుడుగా ఆడిన హార్దిక్ పాండ్యా ఆఖరి బంతికి బౌండరీ బాది 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి టీమిండియా ఆరో బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా చరిత్రకెక్కాడు.