Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: గంభీర్ రాకతో టీమిండియాలో భారీ మార్పు.. తుది జట్టులో 10 మంది బౌలర్లే!

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రాకతో జట్టులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని గంభీర్ పూర్తిగా మార్చేసాడు. కెప్టెన్ల పని సులువయ్యేలా బౌలింగ్ ఆప్షన్స్ పెంచుతున్నాడు. బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న బ్యాటర్లతో పాటు.. బ్యాటింగ్ చేయగల బౌలర్లకు ప్రాధాన్యత ఇస్తున్నాడు.

ప్రస్తుతం తరం క్రికెట్‌కు తగ్గట్లు టీమిండియాను అప్‌డేట్ చేస్తున్నాడు. ఈ తరం అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతీ జట్టు అటాకింగ్ గేమ్ ఆడుతోంది. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో ఒకే రోజు 300 పరుగులు చేస్తే గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు ఏకంగా 400 ప్లస్ రన్స్ చేస్తున్నారు. వన్డే క్రికెట్‌లో ఒకప్పుడు 300 భారీ లక్ష్యంగా కనిపించేది. కానీ ఇప్పుడు 350 పరుగులను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది.

IND vs BAN Head Coach Gautam Gambhir Changed The Equation And Dynamics of Indian Cricket Team

ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యం..
టీ20 క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓటమి ముంగిట నిలిచే జట్టు గెలవడం.. విజయానికి సమీపంగా వచ్చి టీమ్ ఓడిపోవడం జరుగుతోంది. గతంలో ప్రతీ జట్టు ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్ ఆల్‌రౌండర్ లేదా పేస్ ఆల్‌రౌండర్, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో బరిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రతీ జట్టు ధాటిగా ఆడుతుండటంతో.. బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా ఏకంగా 8 మంది బౌలర్లను ఉపయోగించుకుంది. మరోవైపు ఇంగ్లండ్ 7 బౌలింగ్ ఆప్షన్స్‌తో బరిలోకి దిగింది. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన బౌలర్లు.. బౌలింగ్ సామర్థ్యం కలిగిన బ్యాటర్లకు ప్రాధాన్యత దక్కుతుంది.

పార్ట్ టైమ్ బౌలర్లకు డిమాండ్..
ఒకప్పుడు భారత జట్టులో సెహ్వాగ్, సచిన్, గంగూలీ పార్ట్ టైమ్ బౌలర్లుగా రాణించేవారు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సారథ్యంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్స్ లేకుండా చేసింది. కానీ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. బౌలింగ్ ఆప్షన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టాడు.

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగాడు. అంతేకాకుండా జట్టులో సంజూ శాంసన్ మినహా.. మిగతా 10 మంది ఆటగాళ్లకు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటం విశేషం.

తుది జట్టులో 10 మంది బౌలర్లే..
అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీష్ కుమార్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రర్తీ, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లు బౌలింగ్ చేయగలరు. ఈ 10 మందిలో ఆరుగురికి స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండగా.. మరో నలుగురు పేస్ బౌలింగ్ చేయగలరు.

ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం సులువవుతోంది. ఒక బౌలర్‌పై బ్యాటర్ ఎదురు దాడికి దిగినప్పుడు.. అతన్ని ఆపి మరో బౌలర్‌తో బౌలింగ్ చేయించవచ్చు. గంభీర్ రాకతో ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత దక్కుతోంది. ప్రతీ బ్యాటర్ బౌలింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Story first published: Tuesday, October 8, 2024, 20:42 [IST]
Other articles published on Oct 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+