Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ విధ్వంసం.. తల్లడిల్లిన బంగ్లా!

బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74), రింకూ సింగ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఈ ఇద్దరి ఊచకోతకు హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) దూకుడు తోడవ్వడంతో బంగ్లాదేశ్ బౌలర్లు తల్లడిల్లారు. నితీష్, రింకూ సింగ్ నాలుగో వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. రిషద్ హోస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

IND vs BAN Explosive show by Nitish Reddy and Rinku Singh power India to 221-9 in 2nd T20I

టాప్-3 విఫలం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సంజూ శాంసన్(10) రెండో ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే అభిషేక్ శర్మ(15) తంజిమ్ హసన్ షకీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(8) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో భారత్ 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన, నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత బంగ్లాదేశ్ బౌలర్లను చెడుగుడు ఆడింది. పోటాపోటీగా బౌండరీలు బాదింది. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

తెలుగోడి ఊచకోత..
ఈ క్రమంలో అతను 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన తెలుగు తేజం నితీష్.. మెహ్‌దీస్ హసన్ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా 6, 4, 2, 6, 6 బాది 26 పరుగులు పిండుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ చేసేలా కనిపించిన నితీష్ కుమార్‌ను ముస్తాఫిజుర్ ఔట్ చేశాడు.

భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 108 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి హార్దిక్ పాండ్యా రాగా.. రింకూ సింగ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ రెండు సిక్స్‌లు బాది ఔటవ్వగా.. హార్దిక్ పాండ్యా కూడా ధాటిగా ఆడాడు. ఆఖరి ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తీ(0) డకౌటవ్వగా.. అర్ష్‌దీప్ సింగ్ భారీ సిక్సర్ బాది వెనుదిరిగాడు.

Story first published: Wednesday, October 9, 2024, 20:58 [IST]
Other articles published on Oct 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+