IND vs BAN: ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్‌కు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్!

ఢాకా: భారత్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్‌కు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎబాదత్ హోస్సెన్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడ్డ ఎబాదత్ హొస్సెన్.. రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండటం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో గెలుపొంది రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. రెండు జట్ల మధ్య చివరి టెస్ట్ గురువారం(డిసెంబర్ 22)నుంచి ప్రారంభ కానుంది.
ఎబాదత్ హోస్సెన్‌తో పాటు వెటరన్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ కూడా జట్టుకు దూరమయ్యాడు. గజ్జ గాయంతో బాధపడుతున్న తమీమ్ ఇక్బాల్ రెండో టెస్ట్ కూడా ఆడటం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక నజమ్ అహ్మద్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో టెస్ట్ ఆడే 15 మంది సభ్యులతో కూడిన జట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. తాజా పర్యటనలో భారత్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడని తమీమ్ ఇక్బాల్.. చివరి టెస్ట్‌కు కూడా కోలుకోలేదని బీసీబీ పేర్కొంది.
'తొలి టెస్ట్‌లో వెన్ను గాయానికి గురైన ఎబాదత్ హొస్సెన్ రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతని స్థానాన్ని నజమ్ అహ్మద్‌తో భర్తీ చేశాం. అయితే తుది జట్టులో ఆడుతాడా? లేదా? అనేది మ్యాచ్ జరిగే రోజు పిచ్ కండిషన్స్ బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరమా?అనేదానిపై నజమ్ అహ్మద్ అరంగేట్ర ఆధారపడి ఉంది'అని బంగ్లాదేశ్ సెలెక్టర్ హబిబుల్ బాషర్ తెలిపాడు. ఫిట్ నెస్ సమస్యలను ఎదుర్కొన్న బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్ట్‌లోనూ బంగ్లాదేశ్‌ను అతనే నడిపించనున్నాడు.
భారత్‌తో రెండో టెస్ట్‌కు బంగ్లాదేశ్ టీమ్:
జకీర్ హసన్, నజ్ముల్ హోస్సెన్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నురుల్ హసన్(కీపర్), మెహ్‌దీ హసన్ మీరాజ్, తైజుల్ ఇస్లామ్, ఖలెద్ అహ్మద్, నజుమ్ అహ్మద్, మహ్ముదల్ హసన్, మోమినల్ హక్, రాజేర్ రెహ్మాన్ రాజా, టస్కిన్ అహ్మద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications