
చేతి గాయంతో...
అతని చేతికి బలమైన గాయం అయిందని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది. చేతి గాయంతో మహమ్మద్ షమీ ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం మొదలుపెట్టిన ట్రైనింగ్‌లో షమీ చేతికి గాయమైంది. దాంతోనే అతను డిసెంబర్1న బంగ్లాదేశ్‌కు వెళ్లనని ఎన్‌సీఏకు సమాచారమిచ్చాడు.'అని సదరు అధికారి తెలిపాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో సెమీఫైనల్లోనే టీమిండియా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

ప్రాక్టీస్ చేస్తూ..
జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో తప్పుకోవడంతో ఆఖరి నిమిషంలో మెగా టోర్నీకి ఎంపికైన షమీ.. పర్వాలేదనిపించాడు.ప్రపంచకప్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న షమీ.. ట్రైనింగ్‌లో గాయపడ్డాడు. అయితే షమీ గాయం తీవ్రతపై క్లారిటీ లేదు. వన్డేల్లో షమీ సేవలు కోల్పోయినా టీమిండియాకు వచ్చే పెద్ద నష్టం ఏం లేదు కానీ.. టెస్ట్‌ల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాఈ రెండు టెస్ట్‌లను గెలవాలి.

టెస్ట్‌ల్లో కష్టం..
బుమ్రా గైర్హాజరీలో బరిలోకి దిగుతున్న భారత్... షమీ సేవలు కూడా కోల్పోతే ఇబ్బందులు తప్పవు. 'వన్డే సిరీస్‌కు షమీ దూరమవ్వడం ఇబ్బందే. కానీ టెస్ట్‌లకు దూరమైతే టీమిండియాకు కష్టాలు తప్పవు. జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో షమీ రూపంలో ఓ సీనియర్ జట్టుకు అవసరం'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఇప్పటి వరకు 60 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మహమ్మద్ షమీ.. 216 వికెట్లు తీసాడు.

తొలి వన్డేతో..
ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలుపెట్టనుంది. మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14-18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. రెండు టెస్ట్‌లు 9.30కు ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications
