అసలేం జరిగిందంటే..
మహమ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని సిరాజ్ ఇన్‌స్వింగర్ వేయగా.. స్టన్ అయిన బంగ్లా బ్యాటర్ అనముల్ హక్.. డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్‌లో ఉన్న రోహిత్ వైపు లోయర్ క్యాచ్‌గా దూసుకెళ్లింది.
బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్.. ముందుగా చేతి వేళ్లను మూయడంతో క్యాచ్ నేలపాలు అయ్యింది. వేగంగా దూసుకొచ్చిన బంతి అతని ఎడమ చేతి వేళ్లకు బలంగా తాకింది. నొప్పితో విలవిలాడిన రోహిత్.. మైదానం వీడగా.. అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా రజత్ పటీదార్ ఫీల్డింగ్ వచ్చాడు.

ఆసుపత్రికి తరలింపు..
గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం.. చేతి వేళ్లు ఉబ్బడంతో ముందు జాగ్రత్తగా రోహిత్‌ను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో చేతి వేళ్లు విరిగినా.. క్రాక్ వచ్చినా రోహిత్ ఈ పర్యటనకు దూరం కానున్నాడు. సుమారు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే టీమిండియాకు తీరని నష్టం జరుగుతోంది. గత కొంత కాలంగా బ్యాటింగ్ పరంగా రోహిత్ పెద్దగా ఆకట్టుకోకపోయినా.. కెప్టెన్‌గా అతను జట్టులో ఉండటం చాలా ముఖ్యం.

కోలుకోలేని దెబ్బ..
వన్డే ప్రపంచకప్ సన్నాహకల్లో ఉన్న టీమిండియా.. కెప్టెన్ లేకుండా ఆడటం ఇబ్బందిగా మారనుంది. అంతేకాకుండా బంగ్లాతో జరుగుతున్న రెండో వన్డేలో ఒక బ్యాటర్ లేకుండా టీమిండియా ఆడాల్సి ఉంటుంది. ఇది జట్టు విజయవకాశాలను దెబ్బతీయవచ్చు. రోహిత్‌కు ఏం కాకుడదని అతని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ట్విటర్ వేదికగా.. అతను బ్యాటింగ్‌కు దిగుతాడని కామెంట్ చేస్తున్నారు.

రెండు మార్పులతో..
ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్ ఓడగా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ చోటు దక్కించుకోగా.. గాయం నుంచి అక్షర్ పటేల్ కోలుకోవడంతో షెహ్‌బాజ్ అహ్మద్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. బంగ్లాదేశ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 44 పరుగులు చేసింది. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. క్రీజులో నజ్ముల్ షాంటో, షకీబ్ అల్ హసన్ ఉన్నారు.


Click it and Unblock the Notifications
