IND vs BAN: రింకూ సింగ్‌కు గుడ్ న్యూస్!
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువ హిట్టర్ రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. అతన్ని పరిమిత ఓవర్ల బ్యాటర్‌గానే భావిస్తున్న భారత సెలెక్షన్ కమిటీ.. రెడ్ బాల్ ఫార్మాట్‌కు పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం రింకూ సింగ్ యూపీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ20 లీగ్ ఆడుతున్నాడు.
అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించిన 16 మంది సభ్యులు గల జట్టులో సీనియర్ ఆటగాళ్లందరికి చోటు దక్కింది. విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా రీఎంట్రీ ఇచ్చారు. అయితే దులీప్ ట్రోఫీలో భాగంగా ఉండి బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌కు ఎంపికైన ఆటగాళ్లు ఆ టోర్నీ సెకండ్ రౌండ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నారు.

ఈ క్రమంలోనే రింకూ సింగ్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అతన్ని దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్ మ్యాచ్‌లకు ఎంపిక చేసింది. ఇండియా బీ తరఫున ఆడుతాడని పేర్కొంది. భారత్-ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రింకూ సింగ్‌ను ముందుగా దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు. దాంతోనే అతను బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికవ్వలేదు.
తాజా నిర్ణయంతో రింకూ సింగ్ యూపీ టీ20 లీగ్ నుంచి తప్పుకోనున్నాడు. దులీప్ ట్రోఫీలో రింకూ సింగ్ అసాధారణ ప్రదర్శన కనబర్చి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తే అతను భవిష్యత్తు టెస్ట్ సిరీస్‌లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీలో భాగమవ్వడంపై రింకూ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడ.
'కష్టపడటమే నా పని. దులీప్ ట్రోఫీకి ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ప్రకటించిన జట్లలో నాకు చోటు దక్కలేదు. అందుకు నేనేం బాధపడలేదు. మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఇండియా బీ తరఫున దులీప్ ట్రోఫీ ఆడేందుకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.
యూపీ టీ20 లీగ్‌లో నేను సారథ్యం వహించిన మీరట్ మావెరిక్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక నుంచి మాధవ్ కౌశిక్ జట్టును ముందుకు నడిపిస్తాడు. ఈ టోర్నీలో నా అనుభవం అద్భుతం'అని ఓ జాతీయ ఛానెల్‌తో రింకూ సింగ్ అన్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రింకూ సింగ్‌కు మంచి రికార్డ్ ఉంది. 47 మ్యాచ్‌ల్లో అతను 54.70 సగటుతో 3173 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలతో పాటు 20 అర్థశతకాలున్నాయి. ప్రస్తుతం టీమిండియా మేనేజ్‌మెంట్ బౌలింగ్ సామర్థ్యం ఉన్న మిడిలార్డర్ బ్యాటర్లకు ప్రాధాన్యత ఇస్తోంది. దాంతోనే రింకూ సింగ్‌కు అవకాశం దక్కడం లేదు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 12న చెన్నై వేదికగా బీసీసీఐ నిర్వహించే ప్రాక్టీస్ క్యాంప్‌లో ఆటగాళ్లంతా పాల్గొననున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications