భారత్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ మహ్మదుల్లా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. భారత్‌తో అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరిగే మూడో టీ20నే తన చివరి మ్యాచ్ అని వెల్లడించాడు.
వాస్తవానికి మహ్మదుల్లా టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాడు. కానీ బంగ్లాదేశ్ మేనేజ్‌మెంట్ కోరిక మేరకు కొనసాగాడు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే ప్రపంచకప్ 2027 కోసం సన్నదమవుతానని మహ్మదుల్లా తెలిపాడు.

'టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. భారత్‌తో జరిగే మూడో టీ20నే నా చివరి మ్యాచ్. ఇక్కడికి వచ్చే ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా కుటుంబంతో కూడా చర్చించాను. కోచ్, కెప్టెన్, చీఫ్ సెలెక్టర్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడికి ఈ విషయాన్ని తెలియజేశాను.
టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను. మరో రెండేళ్లలో ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో వన్డే క్రికెట్‌పై ఫోకస్ చేయాలనుకుంటున్నాను.'అని మహ్మదుల్లా చెప్పుకొచ్చాడు.
భారత్‌తో జరిగిన తొలి టీ20లో మహ్మదుల్లా ఒక్క పరుగు మాత్రమే చేశాడు. టీమిండియా పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మయాంక్ యాదవ్‌కు ఇదే ఫస్ట్ అంతర్జాతీయ వికెట్ కావడం గమనార్హం. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన మహ్మదుల్లా 2007లో టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్ తరఫున 138 టీ20లు ఆడి 2394 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బౌలింగ్‌లో 40 వికెట్లు తీసాడు. 50 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలతో 2914 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 43 వికెట్లు పడగొట్టాడు. 232 వన్డేల్లో 4 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలతో 5386 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 82 వికెట్లు తీసాడు. టీ20ల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా బంగ్లా తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.