Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ తప్పు లేదు.. అంతా నా దురదృష్టం: అక్షర్ పటేల్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అరంగేట్ర మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్ అవకాశం చేజారడంపై టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ హుందాగా స్పందించాడు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ తప్పిదం ఏ మాత్రం లేదని, అంతా తన దురదృష్టమేనని చెప్పాడు. అక్షర్ పటేల్‌కు కెరీర్‌లో ఇదే తొలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కాగా.. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో తృటిలో హ్యాట్రిక్ వికెట్‌ తీసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

బంగ్లాదేశ్ బ్యాటర్లు టంజిద్ హసన్, ముష్ఫికర్ రహీమ్‌లను అక్షర్ పటేల్ వరుస బంతుల్లో ఔట్ చేసాడు. హ్యాట్రిక్ బంతిని ఎదుర్కొన్న జకేర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. దాంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ వికెట్ మిస్సైంది. కీలక క్యాచ్‌ను వదిలేసిన రోహిత్ శర్మ నేలను గట్టిగా కొట్టి అసహనం వ్యక్తం చేశాడు. తాను చేసిన ఘోర తప్పిదానికి అక్షర్ పటేల్‌ను క్షమాపణలు కూడా కోరాడు.

IND vs BAN Axar Patel refused to blame Rohit s Drop Denying Him Hat-Trick

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. నెటిజన్లు రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించారు. సునాయస క్యాచ్‌ను నేలపాలు చేసి అక్షర్ కొంపముంచావని మండిపడ్డారు. ఈ క్యాచ్ పట్టి అక్షర్ పటేల్ ఖాతాలో హ్యాట్రిక్ చేరి ఉంటే అతని పేరిట పలు వరల్డ్ రికార్డులు నమోదయ్యేవి. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ అనంతరం హ్యాట్రిక్ చేజారడంపై స్పందించిన అక్షర్ పటేల్.. రోహిత్ శర్మ తప్పు లేదని స్పష్టం చేశాడు. అయితే హ్యాట్రిక్ బంతి ఎడ్జ్ తీసుకోగానే సంతోషంతో సంబరాలు చేసుకున్నానని, రోహిత్ క్యాచ్ వదిలేయాడాన్ని ఆలస్యంగా గమనించానని చెప్పాడు. క్యాచ్‌లు వదిలేయడం ఆటలో సహజమేనని అభిప్రాయపడ్డాడు.

'ఆ ఓవర్‌లో చాలా డ్రామా చోటు చేసుకుంది. టాంజిద్ హసన్ ఔటైన విషయాన్ని నేను గుర్తించలేదు. కేఎల్ రాహుల్ అప్పిల్ చేశాడు. దాంతో అంపైర్ ఔటిచ్చాడు. ఆ తర్వాత రెండో వికెట్ దక్కింది. మూడో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోగానే నాకు హ్యాట్రిక్ దక్కిందని భావించాను. ఇది ఓ ఈవెంట్‌ఫుల్ ఓవర్. నేను సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ రోహిత్ క్యాచ్ వదిలేయడం చూశాను. రియాక్ట్ అవ్వకుండా సైలెంట్‌గా వెనక్కి వచ్చాను. ఇదంతా ఆటలో భాగమే.'అని ఇన్నింగ్స్ బ్రేక్‌లో అక్షర్ పటేల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో అన్నాడు.

Story first published: Thursday, February 20, 2025, 21:34 [IST]
Other articles published on Feb 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+