Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: మణికట్టు స్పిన్నర్లకు తీవ్ర అన్యాయం.. రవి బిష్ణోయ్ ఏం పాపం చేశాడు: మాజీ క్రికెటర్

భారత జట్టులో మణికట్టు స్పిన్నర్లకు తగిన గౌరవం దక్కడం లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్.. నిలకడగా రాణిస్తూ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా.. అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదన్నాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో రవి బిష్ణోయ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని తుది జట్టులోకి తీసుకోవడంతో రవి బిష్ణోయ్‌కు అవకాశం లేకుండా పోయింది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తీ మూడు వికెట్లతో సత్తా చాటాడు.

IND vs BAN Aakash Chopra says Ravi Bishnoi is being treated unfairly after missing 1st T20I

మణికట్టు స్పిన్నర్లకు అన్యాయం..
అయితే జింబాబ్వే‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి రవి బిష్ణోయ్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. నిలకడగా రాణించినా అతన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ పట్టించుకోవడం లేదు. తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. మణికట్టు స్పిన్నర్లకే టీమిండియాలో సరైన గౌరవం లభించడం లేదన్నాడు.

గతంలో యుజ్వేంద్ర చాహల్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడని, అతను ఇప్పటి వరకు ఒక్క ప్రపంచకప్ మ్యాచ్ ఆడలేదని గుర్తు చేశాడు. తుది జట్టులో నుంచి ఎవరినైనా తప్పించాల్సి వచ్చినప్పుడు మణికట్టు స్పిన్నర్లనే పక్కనపెడుతున్నారని తెలిపాడు.

రవి బిష్ణోయ్‌ను పట్టించుకోవడం లేదు..
'రవి బిష్ణోయ్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. కానీ అతనికి సరైన గౌరవం లభించడం లేదు. అతనితో భారత జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్ ఫ్రంట్ లైన్ పేసర్‌గా ఎదిగాడు. కానీ రవి బిష్ణోయ్ మాత్రం ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. భారత జట్టు నుంచి ఏ ఆటగాడినైనా తప్పించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రవి బిష్ణోయ్‌ను తప్పిస్తున్నారు.

వాస్తవానికి భారత జట్టు‌లో ఏ మణికట్టు స్పిన్నర్‌కు తగిన గౌరవం లభించడం లేదు. ఇప్పటి వరకు చాహల్ ఒక్క ప్రపంచకప్ మ్యాచ్ ఆడలేదు. అతను జట్టులో ఉన్నప్పటికీ తుది జట్టులో చోటు ఇవ్వలేదు. అదేవిధంగా రవిబిష్ణోయ్ నిలకడగా రాణించినా అవకాశం కల్పించడం లేదు.

బిష్ణోయ్‌కు వివరణ ఇవ్వాలి..
బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో కూడా కొత్త స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకే అవకాశం దక్కింది. రవి బిష్ణోయ్ కంటే అతనే ఫస్ట్ ఛాయిస్ అయ్యాడు. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన అతనికి అవకాశం ఇవ్వడంలో తప్పేమీ లేదు. కానీ రవి బిష్ణోయ్‌కు ఏమని చెబుతారు? 15 మంది ఆటగాళ్లు ఎంపికైనప్పుడు అందర్నీ ఒకేలా చూడాలి.

కానీ ఒక్క ఆటగాడినే ప్రతీసారి తప్పిస్తూ ఉంటే.. అతను నాకే ఎందుకు ఇలా చేస్తున్నారు? అని అడుగుతాడు'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. టీమ్ కాంబినేషన్ గురించి సెలెక్టర్లు, కోచ్‌లు రవి బిష్ణోయ్‌కు సరైన వివరణ ఇవ్వాలని ఆకాశ్ చోప్రా సూచించాడు.

Story first published: Wednesday, October 9, 2024, 17:56 [IST]
Other articles published on Oct 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+