టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతనికి భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ విషయం స్పష్టమైంది. శత్రు దేశం పాకిస్థాన్‌లోనూ విరాట్ కోహ్లీ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా విరాట్ కోహ్లీని చూసేందుకు పదో తరగితి చదువుతున్న ఓ అబ్బాయి ఏకంగా 58 కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.
బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా శుక్రవారం రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు హాజరై తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీని చూడాలని, కార్తీకేయ అనే టెన్త్ క్లాస్ అబ్బాయి ఏకంగా 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి కథనానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఉన్నావో అనే ప్రాంతానికి చెందిన కార్తీకేయకు విరాట్ కోహ్లీ అంటే పిచ్చి అభిమానం. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఒక్కడే సైకిల్‌పై కాన్పూర్ వచ్చాడు. పర్సనల్ సేఫ్టీకి ప్రాధాన్యత కూడా ఇచ్చాడు.
భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. శనివారం కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభమైన తొలి మూడు రోజులు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించింది.