Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN రెండో టెస్ట్.. ఇంకా మొదలవ్వని రెండో రోజు ఆట..!

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు ఆటలో 55 ఓవర్లు మింగేసిన వరణుడు.. రెండో రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడనివ్వలేదు. ఇక మూడో రోజు అయిన ఆదివారం ఇంకా ఆట మొదలవ్వలేదు. వర్షం లేకున్నా.. ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను ప్రారంభించలేదు.

ఔట్ ఫీల్డ్‌లో ఓవైపు పూర్తిగా వర్షం నీరు నిలిచిపోవడంతో.. గ్రౌండ్ స్టాఫ్ వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరికాసేపట్లో అంపైర్లు మైదానాన్ని పరిశీలించనున్నారు. వర్షం మరోసారి వస్తే మాత్రం మూడో రోజు ఆట కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. మూడో రోజు ఆట కూడా సాధ్యం కాకపోతే.. ఈ మ్యాచ్ డ్రా అవుతోంది. చివరి రెండు రోజుల్లో ఆట సాధ్యమైనా అద్భుతం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలడం కష్టం.

IND vs BAN 2nd Test Day 3 Start delayed due to wet outfield

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్‌ చేసింది. తొలి రోజు వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. క్రీజులో మోమినల్ హక్(40 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్(6 బ్యాటింగ్) ఉన్నారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో(31), షెడ్‌మన్ ఇస్లామ్(24), జకీర్ హసన్(0) విఫలమయ్యారు.

భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి మూడు రోజులు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే టీమిండియాకు నష్టం జరగనుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియాకు ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఒక వేళ మ్యాచ్ డ్రా అయితే .. తదుపరి 8 టెస్ట్‌ల్లో 6 మ్యాచ్‌లు తప్పక గెలవాల్సి ఉంటుంది. టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌లు.. ఆస్ట్రేలియా గడ్డపై 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది.

Story first published: Sunday, September 29, 2024, 10:06 [IST]
Other articles published on Sep 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+