Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: నితీష్ కుమార్‌ రెడ్డి‌తో పాటు పేస్ సెన్సేషన్ అరంగేట్రం..!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వాతావరణం ఉక్కపోతగా ఉంది. పిచ్ మారుతుందని అనుకోవడం లేదు. జట్టులో ప్రతిభకలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. మైదానం అద్బుతంగా ఉంది. ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ఈ మ్యాచ్ ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం. తిలక్ వర్మ, రవిబిష్ణోయ్, నితీష్ రాణా, జితేశ్ శర్మ బెంచ్‌కే పరిమితమయ్యారు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

IND vs BAN 1st T20I Nitish Kumar Reddy and Mayank Yadav Debut India Win Toss Chose To Bowl

తెలుగు తేజం సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేతుల మీదుగా ఈ ఇద్దరూ అరంగేట్ర క్యాప్‌లు అందుకున్నారు.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో అన్నాడు. టీ20 ఫార్మాట్‌కు కొత్త జట్టుతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. గత కొన్ని నెలలుగా తమ టీ20 ఆటగాళ్లు బాగా కష్టపడ్డారని, జట్టు చాలా ఫ్రెష్‌గా ఉందని చెప్పాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.

తుది జట్లు:

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్: లిటన్ దాస్(కీపర్), నజ్ముల్ హోస్సేన్ షాంటో(కెప్టెన్), పెర్వెజ్ హోస్సేన్, టౌహిడ్ హృదయ్, మహ్మదుల్లా, జేకర్ అలీ, మెహ్‌దీ హసన్ మీరాజ్, రిషద్ హోస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లామ్.

Story first published: Sunday, October 6, 2024, 18:50 [IST]
Other articles published on Oct 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+