Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం!

IND vs AUS: అక్షర్ పటేల్(3/16) తీన్మార్ బౌలింగ్‌తో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(3/40) మూడు వికెట్లు తీయగా.. జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీకి ఓ వికెట్ దక్కింది.

IND vs AUS: Young India seal series win, India extend unbeaten run in T20Is

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31), మాథ్యూ వేడ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.

175 పరుగుల సాధారణ లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో 3 ఓవర్లలోనే 40 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో రవి బిష్ణోయ్‌ను రంగంలోకి దింపిన సూర్యకుమార్ యాదవ్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. జోష్ ఫిలిప్పీ(8)ని బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ట్రావిస్ హెడ్(31)ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఆసీస్ 2 వికెట్లకు 52 పరుగులు చేసింది.

ఆ వెంటనే ఆరోన్ హార్డీ(8), బెన్ మెక్‌డెర్మోట్(19)లను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ పరిస్థితుల్లో టీమ్ డేవిడ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేయగా.. దీపక్ చాహర్ వరుస ఓవర్లలో అతనితో పాటు మాథ్యూ షార్ట్(22)‌ను పెవిలియన్ చేర్చాడు. మాథ్యూ వేడ్ భారీ షాట్లతో విజయం కోసం ప్రయత్నించినా మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేదు. దాంతో టీమిండియా విజయం లాంఛనమైంది.

Story first published: Friday, December 1, 2023, 22:45 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+