Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొంపముంచిన యశస్వి జైస్వాల్ అత్యుత్సాహం! (వీడియో)

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(118 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 82) ఘోర తప్పిదం చేశాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో సెంచరీ దిశగా సాగిన యశస్వి జైస్వాల్.. చేజేతులా తన వికెట్‌ను పారేసుకున్నాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.

భారత తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ వేసిన 41వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని బౌండరీ తరలించిన యశస్వి జైస్వాల్.. మరుసటి బంతిని మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి నేరుగా కమిన్స్ చేతులోకి వెళ్లడంతో కోహ్లీ సింగిల్‌కు ప్రయత్నించలేదు. బంతిని అందుకున్న కమిన్స్ వికెట్లను కొట్టగా.. మిస్సైంది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని అందకొని స్టంప్స్‌ను పడేసాడు. మరోవైపు జైస్వాల్ మాత్రం క్రీజు మధ్యలోనే ఆగిపోయాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

IND vs AUS Yashasvi Jaiswal run out after A terrible mix-up with Virat Kohli Video

రోహిత్ శర్మ(3), కేఎల్ రాహుల్(24) త్వరగా ఔటైనా.. విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తనకే సాధ్యమైన షాట్లతో బౌండరీలు రాబట్టాడు. 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్.. అనంతరం అదే జోరు కనబర్చాడు. బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. మరోవైపు కోహ్లీ సైతం ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ జోలికి పోకుండా ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు.

ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కానీ యశస్వి జైస్వాల్ అనవసర పరుగు కోసం ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వెంటనే ఏకాగ్రత కోల్పోయిన కోహ్లీ సైతం ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని ఆడబోయి కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో 157 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో ఆకాశ్ దీప్(0 బ్యాటింగ్)తో పాటు రిషభ్ పంత్(3 బ్యాటింగ్) ఉన్నాడు.

అంతకుముందు 311/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140) భారీ శతకంతో చెలరేగగా..సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్‌కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు.

Story first published: Friday, December 27, 2024, 12:32 [IST]
Other articles published on Dec 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+