IND vs AUS: యశస్వి జైస్వాల్ చెత్త రికార్డ్.. ఏడేళ్ల తర్వాత..!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ బాల్‌కు ఔటైన తొలి భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు తొలి బంతికే ఊహించని షాక్ తగిలింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్.. పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రం గోల్డెన్ డకౌటయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్ స్వింగర్‌కు యశస్వి జైస్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో యశస్వి జైస్వాల్ తన పేరిట చెత్త రికార్డ్‌ను లిఖించుకున్నాడు.

ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో ఫస్ట్ బాల్‌కు ఔటైన 9వ భారత బ్యాటర్‌గా నిలిచాడు.
ఆసీస్ గడ్డపై టెస్ట్‌ల్లో ఫస్ట్ బాల్‌కే ఔటైన బ్యాటర్లు:
ఆర్చీ మెక్‌లారేన్(ఇంగ్లండ్): 1894
స్టాన్ వర్తింగ్టన్(ఇంగ్లండ్): 1936
రోరీ బర్న్స్(ఇంగ్లండ్): 2021
యశస్వి జైస్వాల్(భారత్): 2024
టెస్ట్‌ల్లో ఫస్ట్ బాల్‌కే ఔటైన భారత బ్యాటర్లు:
సునీల్ గవాస్కర్ 1974 వర్సెస్ ఇంగ్లండ్
సుదీర్ నాయక్ 1974 వర్సెస్ ఇంగ్లండ్
సునీల్ గవాస్కర్ 1983 వర్సెస్ వెస్టిండీస్
సునీల్ గవాస్కర్ 1987 వర్సెస్ పాకిస్థాన్
డబ్ల్యూవీ రామన్ 1990 వర్సెస్ న్యూజిలాండ్
శివ్ సుందర్ దాస్, 2002, వెస్టిండీస్
వాసిమ్ జాఫర్, 2007 వర్సెస్ బంగ్లాదేశ్
కేఎల్ రాహుల్, 2017 వర్సెస్ శ్రీలంక
యశస్వి జైస్వాల్, 2024 వర్సెస్ ఆస్ట్రేలియా
పింక్ బాల్ టెస్ట్‌లో భారత బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. యశస్వి జైస్వాల్(0), విరాట్ కోహ్లీ(7), రోహిత్ శర్మ(3), హర్షిత్ రాణా(0) దారుణంగా విఫలమవ్వడంతో భారత్ 141 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(37), శుభ్‌మన్ గిల్(31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ప్రస్తుతం క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications