Ind vs Aus, worldcup 2023 Final: టీమిండియాకు బిగ్ షాక్..!
Ind vs Aus, worldcup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4) దారుణంగా విఫలమయ్యారు. ధాటిగా ఆడిన రోహిత్ శర్మ(47) మరోసారి హాఫ్ సెంచరీ ముంగిట క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 10.3 ఓవర్లలోనే 81 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది.
ఎన్నో అంచనాల మధ్య ఫైనల్ బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో ఫైనల్ ఒత్తిడి తట్టుకోలేకపోయిన శుభ్‌మన్ గిల్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో చెత్త షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ తన జోరును కొనసాగించాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు.

హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను గ్లేన్ మ్యాక్స్‌వెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్.. భారీ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు.
రోహిత్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను ట్రావిస్ హెడ్ అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ బౌండరీతో జోరు కనబర్చాడు. కానీ ప్యాట్ కమిన్స్ వేసిన తెలివైన బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో విరాట్ కోహ్లీ(29 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నాడు.
సెమీఫైనల్లో శతక్కొట్టిన శ్రేయస్ అయ్యర్.. కీలక మ్యాచ్‌లో విఫలమవ్వడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, అయ్యర్ చేతులెత్తేసారని మండిపడుతున్నారు. ఎంతో ఆశతో మ్యాచ్ చూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశ పరిచారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications