IND vs AUS, World Cup 2023 ఫైనల్ మ్యాచ్ టై లేదా రద్దయితే ?
IND vs AUS, World Cup 2023: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా టైటిల్ ఫైట్‌కు తెరలేవనుంది. ఆతిథ్య భారత్.. ఫైవ్ టైమ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతున్నాయి. ఈ మెగా ఫైనల్ కోసంముగింపు వేడుకల ఏర్పాట్లు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. నాలుగు దశల్లో ఏర్పాట్లు చేసిన ముగింపు వేడుకలు అభిమానులను అలరించనున్నాయి.
ఆటకు ముందు మ్యూజిక్ లైవ్ షో.. ఆట ప్రారంభానికి 10 నిమిషాల ముందు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విన్యాసాలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్‌లో కళ్లు మిరమిట్లు గొలిపే లేజర్ షో, మ్యాచ్ ముగిసిన తర్వాత ఫైర్ వర్క్స్‌ను నిర్వహించనున్నారు.

ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మెగా టోర్నీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్‌డే నవంబర్ 20న ఆటను కొనసాగిస్తారు.
ఆ రోజు కూడా మ్యాచ్ సాధ్యం కాక రద్దయితే మాత్రం టోర్నీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇరు జట్ల స్కోర్లు టై అయితే మాత్రం సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే.. ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు. గత ప్రపంచకప్ మాదిరి బౌండరీల కౌంట్ అనే అసంబద్దమైన నిబంధనను ఉపయోగించారు.
ఈ రూల్‌ను మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రద్దు చేసింది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఈ రూల్ ద్వారానే ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠగా సాగిన ఆ ఫైనల్ పోరులో ఇరు జట్ల స్కోర్లు టై అయ్యాయి. సూపర్ ఓవర్ నిర్వహించగా.. మళ్లీ స్కోర్లు టై అయ్యాయి. దాంతో బౌండరీ కౌంట్ అనే అసంబంధమైన నిబంధనతో ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.
అప్పట్లో ఈ రూల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తొండాటతో ఇంగ్లండ్ విజేతగా నిలిచిందని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఈరూల్‌పై సమీక్ష జరిపిన ఎంసీసీ.. రద్దు చేసింది. ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్స్ ఆడించాలని స్పష్టం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications