IND vs AUS, World Cup 2023 Final: అప్పుడు ఓడాం.. ఇప్పుడు గెలుస్తాం!
IND vs AUS, World Cup 2023 Final: వరల్డ్‌కప్ 2023లో ఎదురు లేని ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. అసలు సిసలు సమరానికి సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా భారత్ ప్రయాణం కొనసాగితే.. తొలి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన ఆసీస్.. అనూహ్య ప్రదర్శనతో వరుసగా 8 విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకొచ్చింది.
మెగా టోర్నీ చరిత్రలోనే అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన ఆసీస్‌కు తిరుగులేదు. ఫైనల్లో ఆ జట్టు ఇప్పటి వరకు ఓడిపోలేదు. కానీ 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇదే ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఆ టోర్నీలో ఓడినా.. ఇప్పుడు భారత్‌దే విజయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు 2003 వన్డే ప్రపంచకప్ నాటి పరిస్థితులనే ఉదహారణగా పేర్కొంటున్నారు.

2003 ప్రపంచకప్‌లోనూ ఆస్ట్రేలియా ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిందని, భారత్ వరుసగా 8 విజయాలు సాధించి ఫైనల్లో ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఆ టోర్నీలో టీమిండియా రెండు సార్లు ఆసీస్ చేతిలోనే ఓటమిపాలైంది. లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో చిత్తయిన టీమిండియా.. ఫైనల్లో 68 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
తాజా టోర్నీలో రివర్స్ అయ్యిందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. లీగ్ దశలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో చిత్తయ్యిందని, రేపు ఫైనల్లో కూడా ఓడిపోతుందని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. రేపు టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసి.. భారీ స్కోర్ ఆసీస్ ముందు ఉంచుతుందని, భారీ పరుగుల తేడాతో గెలుస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
2003, 2023 వన్డే ప్రపంచకప్ పరిస్థితులన్నీ ఒకేలా ఉన్నాయని, అప్పటి ఆసీస్‌లా ఇప్పుడు టీమిండియా చెలరేగడం మాత్రమే తేడానని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆదివారం విజయం సాధించి 20 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications