Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023 Final: టీమిండియా గెలవాలంటే ఈ 5 తప్పిదాలు చేయకూడదు!

IND vs AUS, World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 అసలు సిసలు సమరానికి రంగం సిద్దమైంది. మరికొన్ని గంటల్లో మెగా ఫైనల్‌కు తెరలేవనుంది. వరుసగా 10 విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. అనూహ్య విజయాలతో ఫైనల్‌ చేరిన ఆసీస్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా.. బీసీసీఐ ముగింపు ఏర్పాట్లను ఘనంగా ప్లాన్ చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఈ మ్యాచ్‌కు రానున్నారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో 2003లో ఇరు జట్ల ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత్ ఓడిపోగా.. ఆసీస్ విజేతగా నిలిచింది.

IND vs AUS, World Cup 2023 Final: 5 mistakes Team India must avoid

ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మరోసారి ఫైనల్లో ఓడిపోవద్దంటే గంగూలీ సేన చేసిన 5 తప్పిదాలు రోహిత్ సేన అస్సలు చేయకూడదు.

1. టాస్ గెలిచి సరైన నిర్ణయం తీసుకోవడం..
2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం.. ఓటమికి కారణమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారీ స్కోర్ చేయగా.. అనంతరం భారత్ తేలిపోయింది. ఈ క్రమంలోనే తాజా ఫైనల్లో టీమిండియా టాస్ గెలిస్తే సరైన నిర్ణయం తీసుకోవాలి. అహ్మదాబాద్ మైదానం రికార్డుల ప్రకారం ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. నాకౌట్ ఒత్తిడి ఉండొద్దంటే ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు చేయడమే ఉత్తమం.

IND vs AUS, World Cup 2023 Final: 5 mistakes Team India must avoid

2. అదిరిపోయే ఆరంభం కావాలి..
2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హెడెన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. భారత్‌ కూడా బ్యాటింగ్‌కు దిగితే అదే చేయాలి. ఒకవేళ ముందుగా ఫీల్డింగ్ చేయాల్సి వస్తే మాత్రం ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వార్నర్‌లను పవర్ ప్లేలోనే ఔట్ చేయాలి.

3. కట్టుదిట్టంగా డెత్ బౌలింగ్‌ ఉండాలి..
భారత వెటరన్ పేసర్లు జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్, ఆశీష్ నెహ్రాలు డెత్ ఓవర్లలో తేలిపోయారు. చివరి 10 ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చారు. తాజా పేసర్లు ఆ తప్పిదం చేయవచ్చు. క్రీజులో సెట్ అవ్వకుండా వరుసగా వికెట్లు తీయాలి. డెత్ ఓవర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీస్‌లను కట్టడి చేయాలి.

IND vs AUS, World Cup 2023 Final: 5 mistakes Team India must avoid

4. శుభారంభం దక్కాలి..
ముందుగా బ్యాటింగ్ చేసినా.. చేజింగ్‌కు దిగినా టీమిండియా ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించాలి. గత 10 మ్యాచ్‌ల్లో రోహిత్ ఎలా అయితే అటాకింగ్ గేమ్ ఆడాడో అలానే బ్యాటింగ్ చేయాలి. అప్పుడే లక్ష్యాన్ని చేధించాలన్నా.. భారీ స్కోర్ చేయాలన్నా తదుపరి బ్యాటర్లకు ఈజీ అవుతోంది.

5. వీలైనంతర వరకు తీసుకెళ్లాలి..
లక్ష్యచేధనకు దిగితే గేమ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలి. 2003 ప్రపంచకప్ ఫైనల్లో ఇదే మిస్సయ్యింది. ఆరంభం వికెట్లు కోల్పోతే.. ఆచితూచి ఆడుతూ.. లక్ష్యానికి చేరువగా వెళ్లాలి.

Story first published: Saturday, November 18, 2023, 23:01 [IST]
Other articles published on Nov 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+