Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆ ఒక్క తప్పిదం.. అశ్విన్ కెరీర్ ఖేల్ ఖతమ్!

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఏకైక స్పిన్నర్‌తో బరిలోకి దిగిన టీమిండియా.. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించింది.

సీనియర్ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, అశ్విన్‌లను బెంచ్‌కే పరిమితం చేసింది. శుక్రవారం(డిసెంబర్ 6) నుంచి అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అశ్విన్‌కు అవకాశం దక్కలేదు. రెండో స్పిన్నర్‌గా జడేజాకే అవకాశం ఇవ్వగా.. అతను కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.

IND vs AUS Why Ravichandran Ashwin are out of playing XI in Border-Gavaskar Trophy

బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్‌తో పాటు జడేజాకే టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇస్తోంది. ఒకవేళ రెండో స్పిన్నర్‌ను తీసుకున్నా.. జడేజాకే అవకాశం దక్కనుంది. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో అశ్విన్ పేలవ ప్రదర్శన కనబర్చడమే అతన్ని తప్పించడానికి కారణంగా తెలుస్తోంది.

ఈ మూడు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై తొలిసారి క్లీన్ స్వీప్‌కు గురైంది. అపారమైన అనుభవం కలిగిన అశ్విన్.. ఈ మూడు మ్యాచ్‌ల్లో తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. న్యూజిలాండ్ స్పిన్నర్లు సత్తా చాటిన వికెట్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

అంతేకాకుండా ఆసీస్ గడ్డపై అశ్విన్‌కు మెరుగైన రికార్డ్ లేదు. 18 ఇన్నింగ్స్‌ల్లో అతను 39 వికెట్లు మాత్రమే తీసాడు. ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ఘనతను అందుకోలేదు. గతంలో కూడా ఆసీస్ గడ్డపై అశ్విన్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్‌ అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఆడే చివరి సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ సిరీస్‌లో భారత్ గెలిచి.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా.. ఆ మ్యాచ్‌లోనూ అశ్విన్‌కు చోటు దక్కుతుందనే గ్యారంటీ లేదు.

ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్ వేదికగా జరగనుంది. ఇంగ్లీష్ పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అక్కడ కూడా అశ్విన్‌‌కు గొప్ప రికార్డ్ లేదు. ఈ క్రమంలోనే పేస్ పిచ్‌లకు తగ్గట్లు బౌలింగ్ చేసే వాషింగ్టన్ సుందర్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. లోయరార్డ్‌లో బ్యాటింగ్‌లో కూడా అతను కీలకం కానున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పేస్ పిచ్‌లపై వాషింగ్టన్ సుందర్.. జట్టుకు కీలకమవుతాడని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే అశ్విన్ కెరీర్‌ ముగిసిందనే చర్చ జోరుగా సాగుతోంది.

Story first published: Wednesday, December 4, 2024, 18:16 [IST]
Other articles published on Dec 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+