Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు.. బ్లాక్ రిబ్బన్స్‌తో టీమిండియా నిరసన?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్-1లో టీమిండియా నల్ల బ్యాడ్జీలతో బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఫీల్డింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లంతా నల్లని బ్యాడ్జీలతో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి శమా మహమ్మద్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్‌కు నిరసనగానే టీమిండియా ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్ ధరించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ మాజీ క్రికెటర్ ప‌ద్మాక‌ర్ శివాల్క‌ర్ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్ ధరించారు. వయసు పైబడటంతో పద్మాకర్ శివాల్కర్ సోమవారం మరణించారు.

IND vs AUS Why India Are Wearing Black Armbands Against Australia In Champions Trophy 2025 Semifinal

భార‌త దేశ‌వాళీ క్రికెట్‌లో శివాల్క‌ర్‌.. మేటి స్పిన్న‌ర్‌గా గుర్తింపు పొందారు. ముంబై త‌ర‌పున శివాల్క‌ర్ 124 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 19.69 స‌గ‌టుతో 589 వికెట్లు తీశాడు. దేశ‌వాళీ క్రికెట్‌లో మేటి స్పిన్న‌ర్‌గా శివాల్క‌ర్ త‌న పాత్ర‌ను పోషించారు. 1972-73 రంజీ ఫైన‌ల్లో శివాల్క‌ర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 ప‌రుగులు ఇచ్చి 8 వికెట్లు తీసిన శివాల్కర్.. రెండో ఇన్నింగ్స్‌లో 18 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో త‌మిళ‌నాడుపై ముంబై సంచలన విజ‌యం న‌మోదు చేసింది.

దేశవాళీ క్రికెట్‌లో మెరుగ్గా రాణించినా.. అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కలేదు. ఆ సమయంలో భారత జట్టులో బిషన్ సింగ్ బేడీ అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో శివాల్కర్‌కు అవకాశం దక్కలేదు. 2017లో శివల్కర్‌ను క‌ల్న‌ల్ సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించింది. ఆయన మృతి నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగి నివాళులర్పించారు.

Story first published: Tuesday, March 4, 2025, 15:14 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+