Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: పుజారా చెత్త రికార్డు.. 100వ టెస్ట్‌లో రెండు సార్లు డకౌట్! (వీడియో)

IND vs AUS: Watch Cheteshwar Pujara falling for duck twice in seven balls in his 100th Test

న్యూఢిల్లీ: కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్న టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పుజారా డకౌట్‌గా వెనుదిరిగి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఏడు బంతుల వ్యవధిలోనే పుజారా రెండు సార్లు డకౌటవ్వడం విశేషం. అయితే అంపైర్, ఆస్ట్రేలియా తప్పిదంతో గట్టెక్కిన పుజారా.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు.

కేఎల్ రాహుల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా ఎదుర్కొన్న తొలి బంతికే నాథన్ లయన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదంతో పాటు ఆస్ట్రేలియా రివ్యూ తీసుకోకపోవడం పుజారాకు కలిసొచ్చింది. అంపైర్ ఔటిచ్చినా.. ఆసీస్ రివ్యూ తీసుకున్న పుజారా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

అప్పటికే రెండు రివ్యూలను వృథా చేసుకున్న ఆసీస్.. మరో సమీక్ష తీసుకోవడానికి దైర్యం చేయలేకపోయింది. దాంతో ఊపిరి తీసుకున్న పుజారా.. లయన్ వేసిన మరుసటి ఓవర్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. మరోసారి అంపైర్ ఔటివ్వకపోగా.. ఈ సారి ఆసీస్ ఎలాంటి తప్పు చేయలేదు. కాన్ఫిడెన్స్‌తో రివ్యూకెళ్లి ఫలితం సాధించింది. రిప్లేలో బంతి ముందుగా ప్యాడ్‌ను తాకిన తర్వాత బ్యాట్ తాకినట్లు తేలడంతో పుజారా వెనుదిరగక తప్పలేదు. దాంతో 100వ టెస్ట్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన 8వ బ్యాటర్‌గా పుజారా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెట్ దిలీప్ వెంగ్‌సర్కార్ అగ్రస్థానంలో ఉండగా.. అలెన్ బోర్డర్, వాల్ష్, టేలర్, ఫ్లెమింగ్, అలిస్టర్ కుక్, బ్రెండన్ మెక్‌కల్లమ్.. పుజారా కన్నా ముందున్నారు.

21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. నాథన్ లయన్ దెబ్బకు 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో సెట్ అయిన కెప్టెన్ రోహిత్(32)‌తో పాటు కేఎల్ రాహుల్(17), పుజారా(0), శ్రేయస్ అయ్యర్(4) నాథన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నిదానంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో టీమిండియా 88/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

Story first published: Saturday, February 18, 2023, 12:47 [IST]
Other articles published on Feb 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+