Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: కోహ్లీ ఔట్.. కెప్టెన్‌‌గా రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాదే బ్యాటింగ్

Australia opt to bat, Virat Kohli rested for India

దుబాయ్: టీ20 ప్రపంచకప్ సన్నాహకంలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వామప్ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. దాంతో ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో తాత్కలిక కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో చేజింగ్ చేశాం కాబట్టి ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. జోష హెజెల్ వుడ్ ఫీల్డింగ్ చేయడని, మిచెల్ స్వెప్సన్, జోష్ ఇంగ్లీస్ కూడా ఆడటం లేదని చెప్పాడు.

ఇక తాము కూడా ముందే బ్యాటింగ్ చేయాలనుకున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. ఆరో బౌలింగ్ ఆప్షన్‌తో పాటు బ్యాటింగ్ కాంబినేషన్‌ను ఈ మ్యాచ్‌తో సెట్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు. ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకున్నా త్వరలోనే మొదలుపెడతాడని చెప్పాడు. మా క్వాలిటీ బౌలర్లు ఉన్నారని, అయినా ఆరో బౌలింగ్ ఆప్షన్ అవసరమని చెప్పాడు.

తుది జట్లు:

భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తీ

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్

Story first published: Wednesday, October 20, 2021, 15:32 [IST]
Other articles published on Oct 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+