Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: మైదానంలో ‘నాటు నాటు’స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ!( వీడియో)

 IND vs AUS: Virat Kohlis Naatu Naatu dance in india vs Australia 1st ODI match goes viral

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతోనే కాకుండా తన చర్యలతోనూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఫీల్డింగ్ చేసే సమయంలోనూ అభిమానులను ఉత్సాహపరుస్తూ కనబడుతూ ఉంటాడు. ఈ క్రమంలో తన దైన శైలిలో డ్యాన్స్ స్టెప్పులేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలోనూ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఆస్కార్ అవార్డు అందుకున్న 'నాటు నాటు' పాట స్టెప్పులెస్తూ అభిమానులను అలరించాడు.

టీమిండియా ఫీల్డింగ్ సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన విరాట్ కోహ్లీ.. నాటు నాటు స్టెప్పులేయడం టీవీ కెమెరాల్లో కనిపించింది. ఈ వీడియోను అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. ట్రిపుల్ ఆర్ టీమ్ స్పందించింది. విరాట్ కోహ్లీ ట్యాగ్ చేస్తూ లవ్ ఎమోజీలతో రీట్వీట్ చేసింది. ట్విటర్‌లో కాపీరైట్ కారణంగా ఈ వీడియో డిలీట్ అవ్వగా.. ఇన్‌స్టాలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ పంచుకుంది. కోహ్లీ నాటు నాటు స్టెప్పులకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది.

ట్రెండింగ్ సాంగ్స్‌కు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక సాంగ్స్‌కు కాలుకదిపాడు. బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ సమయంలోనూ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి షారుక్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'పఠాన్' పాటకు స్టెప్పులు వేసాడు. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయ్యింది.

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ గతేడాది విడుదలై అఖండ విజయం సాధించింది. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట, 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' కేటగిరిలో 'ఆస్కార్' అవార్డు అందుకుంది. ఈ కేటగిరిలో ఆస్కార్ గెలిచిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ట్రిపుల్ ఆర్ సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్లతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్(91 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 75 నాటౌట్), రవీంద్ర జడేజా(69 బంతుల్లో 5 ఫోర్లతో 45 నాటౌట్) రాణించారు.

Story first published: Friday, March 17, 2023, 20:32 [IST]
Other articles published on Mar 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+