Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia:కెప్టెన్‌గా రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీనే ఎంతో నయం.. ఎందుకంటే..?

IND vs AUS: Virat Kohli Is Having Better Captaincy Records Than Rohit Sharma In T20 Cricket

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ పరాజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌లో మెరుగ్గానే రాణించినా.. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దాంతో మంగళవారం జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ పరాజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కెప్టెన్‌గా హ్యాట్రిక్ పరాజయాలను అందుకున్నాడు. ఆసియా కప్‌లో శ్రీలంక, పాకిస్థాన్ చేతిలో ఓటములు ఎదుర్కొన్న రోహిత్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఆసీస్‌తో కెప్టెన్ బరిలోకి దిగి పరాజయాన్నందుకున్నాడు.

 టీ20 చరిత్రలో కింగ్ కోహ్లీ ఒక్కడే..

టీ20 చరిత్రలో కింగ్ కోహ్లీ ఒక్కడే..

రోహిత్ వైఫల్యం కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీ టీ20ల్లో వరుసగా మూడు పరాజయాలను చూడని ఏకైక కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. కనీసం 30 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన సారథుల్లో కోహ్లీ మినహా అందరూ హ్యాట్రిక్ పరాజయాలు చవిచూసారు. తాజాగా రోహిత్ శర్మ సైతం ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవడంతో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఆసీస్ చేతిలో ఓటమి నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా రోహిత్ ఒత్తిడికి గురవుతున్నాడని, కెప్టెన్సీని భారంగా ఫీలవుతున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వద్దన్నా భువీకే 19వ ఓవర్..

వద్దన్నా భువీకే 19వ ఓవర్..

భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో రాణించలేడనే విషయం తెలిసినా.. అతనికి మళ్లీ బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని నెటిజన్లు మండిపుడుతున్నారు. ముఖ్యంగా 19వ ఓవర్ భువనేశ్వర్‌కు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. భువీ పవర్ ప్లే బౌలర్ అంటూ మాజీ విశ్లేషకులు మొత్తుకుంటున్నా రోహిత్ మాత్రం తానో మోనర్క్ తననెవరూ మార్చలేరనేలా భువీకి బౌలింగ్ ఇస్తూ గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడేలా చేస్తున్నాడు. భువీని పవర్ ప్లే, మిడిల్ ఓవర్లో వాడుకుంటే కొంత బెటర్ వికెట్ టేకింగ్ ఆప్షన్లు ఉంటాయని సగటు అభిమానికి అర్థమవుతున్నా.. డెత్ ఓవర్లలో భువీని పదేపదే బౌలింగ్ చేయిస్తూ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు.

ఆటగాళ్లపై అరుస్తూ..

ఆటగాళ్లపై అరుస్తూ..

ఇక మ్యాచ్‌లో ప్రతీకూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా సహనం కోల్పోతున్న రోహిత్ శర్మ.. ఆటగాళ్లపై నోరుపారేసుకుంటున్నాడు. తొలి టీ20లో కీపర్ దినేశ్ కార్తీక్‌పై రోహిత్ కన్నెర్ర చేశాడు. కీపింగ్ యాక్టీవ్‌గా చేయడం లేదని, చెవులు వినబడటం లేదా? అంటూ మందలించాడు. బ్యాట్‌కు బంతి తగిలిందో లేదో కూడా తెలియకుంటే ఎలా అని చివాట్లు పెట్టాడు. బౌలర్ల మార్పులు, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ రోహిత్ గాడితప్పాడు. ఒత్తిడితో అనేక తప్పిదాలు చేస్తూ.. టీమిండియా ఓటమికి కారణమవుతున్నాడు. రోహిత్ శర్మ సారథ్యంతో పోలిస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఎంతో నయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

టాప్ లేపిన గ్రీన్..

టాప్ లేపిన గ్రీన్..

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 నాటౌట్‌) కెరీర్‌లో అత్యధిక స్కోరు సాధించగా, రాహుల్‌ (35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 46) తనదైన శైలిలో ఆడాడు. ఎల్లీస్‌కు మూడు, హాజెల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసి గెలిచింది. గ్రీన్‌ (30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61), వేడ్‌ (21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 నాటౌట్‌) మెరుపు ఆటను ప్రదర్శించారు. అక్షర్‌కు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గ్రీన్‌ నిలిచాడు.

Story first published: Wednesday, September 21, 2022, 15:56 [IST]
Other articles published on Sep 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+