IND vs AUS: ఆకాశ్ దీప్ భారీ సిక్సర్.. నోరెళ్ల బెట్టిన విరాట్ కోహ్లీ! (వీడియో)
టీమిండియా టెయిలెండర్ ఆకాశ్ దీప్ (31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 బ్యాటింగ్)అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ మరో టెయిలెండర్ జస్‌ప్రీత్ బుమ్రా(27 బంతుల్లో సిక్స్‌తో 10 బ్యాటింగ్)తో కలిసి టీమిండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఆఖరి వికెట్‌కు అజేయంగా 39 పరుగులు జోడించాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన 75వ ఓవర్‌లో ఎలాంటి బెరుకు లేకుండా బౌండరీ బాదిన ఆకాశ్ దీప్.. ఫాలో ఆన్ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత మరింత స్వేచ్చగా.. ఆత్వవిశ్వాసంతో బ్యాటింగ్ చేసిన ఆకాశ్ దీప్ భారీ సిక్సర్ బాదాడు.

ఈ ఓవర్ నాలుగో బంతిని కమిన్స్ గుడ్ లెంగ్త్‌లో వేయగా.. ఆకాశ్ దీప్ ఫ్రంట్ లెగ్ జరిపి ఓవర్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ సిక్సర్‌కు విరాట్ కోహ్లీ అవాక్కయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు చూస్తూ... నోరెళ్ల బెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆకాశ్ దీప్ సంచలన బ్యాటింగ్‌తో భారత డ్రెస్సింగ్ రూమ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తీవ్రంగా తడబడింది. యశస్వి జైస్వాల్(4), శుభ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(3), రిషభ్ పంత్(9), రోహిత్ శర్మ(10) తీవ్రంగా నిరాశపరిచారు.
కేఎల్ రాహుల్(139 బంతుల్లో 8 ఫోర్లతో 84), రవీంద్ర జడేజా(123 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 77) ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. రాహుల్ ఔటైన తర్వాత జడేజా, నితీష్ కుమార్ రెడ్డితో కలిసి 53 పరుగులు జోడించాడు.
ఫాలో ఆన్ గండం గట్టెక్కడానికి భారత్‌కు 246 పరుగులు అవసరమవ్వగా.. జడేజా 213 పరుగుల వద్ద కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారత్ ఫాలో ఆన్ ఆడటం తప్పదని అంతా అనుకున్నారు. కానీ బుమ్రా-ఆకాశ్ దీప్ అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నారు. దాదాపు ఓటమి నుంచి గట్టెక్కించారు. బుధవారం మ్యాచ్‌కు చివరి రోజు కాగా.. మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
THE CONFIDENCE OF AKASHDEEP.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024
- Smashed a six against Australian captain Cummins. 🫡🇮🇳pic.twitter.com/XLrooWZEKi
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications