Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: 76 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డ్‌పై కన్నేసిన కోహ్లీ!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డ్‌కు చేరువయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై మరో శతకం సాధిస్తే వేరే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్‌ను సమం చేస్తాడు. ఆసీస్‌కు చెందిన డాన్ బ్రాడ్‌మన్ ఇంగ్లండ్ గడ్డపై 11 శతకాలు నమోదు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసీస్ గడ్డపై 10 శతకాలతో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో జేబీ హాబ్స్ (9 సెంచరీలు- ఆస్ట్రేలియాపై), సచిన్ (9 సెంచరీలు- శ్రీలంక) ఉన్నారు.

కోహ్లీ మరో రెండు సెంచరీలు నమోదు చేస్తే డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్‌ను అధిగమిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఇప్పటికే ఓ శతకం బాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్‌లో ఆతిథ్య ఆసీస్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

IND vs AUS Virat Kohli eyes Sir Don Bradman s 76-year-old All-Time Test record

ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకం సాధిస్తే బ్రాడ్‌మన్ రికార్డ్ సమం చేస్తాడు. ఇక అడిలైడ్‌లో కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 15 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 957 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో ఇక్కడ ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ మూడు శతకాలు, హాఫ్ సెంచరీతో 509 పరుగులు చేశాడు.

ఇక కోహ్లి మరో సెంచరీ సాధిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా కోహ్లి రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డును సచిన్ టెండూల్కర్‌తో కలిసి కోహ్లి సంయుక్తంగా పంచుకున్నాడు. 65 ఇన్నింగ్స్‌ల్లో సచిన్, 44 ఇన్నింగ్స్‌లో కోహ్లి తొమ్మిది సెంచరీలు చేశారు. సచిన్, కోహ్లి తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్ (8 సెంచరీలు- 51 ఇన్నింగ్స్‌లు), స్టీవ్ స్మిత్ (8 సెంచరీలు- 37 ఇన్నింగ్స్‌లు), మైకేల్ క్లార్క్ (7 సెంచరీలు- 40 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.

కాగా, రెండో టెస్టులో కోహ్లి మరో 23 పరుగులు సాధిస్తే.. డే/నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ్ వేదికలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా లారా రికార్డును కోహ్లి అధిగమిస్తాడు. అడిలైడ్‌లో లారా 611 పరుగులు చేయగా కోహ్లి 509 పరుగులు చేశాడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. పింక్ బాల్‌తో జరగనున్న ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.

Story first published: Wednesday, December 4, 2024, 20:28 [IST]
Other articles published on Dec 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+