Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు!

IND vs AUS: Virat Kohli eyes batting milestone in Johannesburg, looks to equal Steve Waughs captaincy record

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారీ విజయాన్నందుకున్న భారత్ మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ గెలుపుతో మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వాండరర్స్ టెస్ట్‌లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టిస్తుంది. అదే జరిగితే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పలు ఘనతలను సొంతం చేసుకుంటాడు. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందించిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కుతాడు.

అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ స్టీవ్‌వా (41) సరసన నిలుస్తాడు. ఈ జాబితాలో ఈ ఆసీస్‌ మాజీ సారథి ప్రస్తుతం మూడో స్థానంలో నిలవగా.. విరాట్‌ 40 విజయాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌ గెలవడం ద్వారా కోహ్లీ.. స్టీవ్‌వాతో సమానంగా మూడో స్థానంలో నిలుస్తాడు.

మరో ఏడు పరుగులు చేస్తే..

మరో ఏడు పరుగులు చేస్తే..

మరోవైపు బ్యాటింగ్‌ పరంగా కోహ్లీ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో లేడన్న సంగతి తెలిసిందే. అయితే, కొత్త ఏడాదిలోనైనా మునుపటిలా రాణించాలని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలోనే జోహెనస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికాతో ఆడే రెండో టెస్టులో మరింత రాణించి పాత రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నాడు. విరాట్‌ ఇప్పటికే ఈ మైదానంలో ఆడిన రెండు టెస్టుల్లో 310 పరుగులు సాధించగా.. న్యూజిలాండ్‌ మాజీ బ్యాట్సమన్‌ జాన్‌ రీడ్‌ సైతం రెండు టెస్టుల్లోనే 316 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో కోహ్లీ మరో ఏడు పరుగులు సాధించి జాన్‌ రీడ్‌ రికార్డును అధిగమించాలని చూస్తున్నాడు.

వాండరర్స్‌లో విరాట్ వండర్స్..

వాండరర్స్‌లో విరాట్ వండర్స్..

ఇక ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌.. ఈ వాండరర్స్‌ మైదానంలోనే ఆడిన నాలుగు టెస్టుల్లో 263 పరుగులు చేసి ఆ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ రెండు టెస్టుల్లో 262 పరుగులు చేసి నాలుగులో నిలిచాడు. కాగా, విరాట్‌కు ఈ మైదానంలో మంచి రికార్డే ఉంది. 2013లో తొలిసారి (119, 96) పరుగులు చేసిన అతను 2018 పర్యటనలో (54, 41) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మూడోసారి మరింత చెలరేగి తన మునుపటి ఫామ్‌ను అందుకోవడమే కాకుండా జట్టును విజయతీరాలకు చేర్చాలని భావిస్తున్నాడు.

ద్రవిడ్ రికార్డు సైతం..

ద్రవిడ్ రికార్డు సైతం..

అలాగే సౌతాఫ్రికాలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (11 మ్యాచ్‌లు, 624 పరుగులు)ను వెనక్కి నెట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం విరాట్‌ ఈ సఫారీల గడ్డపై 6 మ్యాచ్‌ల్లోనే 611 పరుగులతో కొనసాగుతున్నాడు. దీంతో మరో 14 పరుగులు చేస్తే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటాడు. మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఈ దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్‌ఇండియా తరఫున అత్యధికంగా 15 మ్యాచ్‌ల్లో 1,161 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచాడు.

Story first published: Sunday, January 2, 2022, 17:43 [IST]
Other articles published on Jan 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+