For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS:మరో మైలు రాయి ముంగిట విరాట్ కోహ్లీ! సెంచరీ దేవుడెరుగు.. ఇదైనా అందుకుంటాడా?

IND vs AUS: Virat Kohli Close To 300 International Catches ahead of Indore test

ఇండోర్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలు రాయి ముంగిట నిలిచాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బుధవారం నుంచి జరగనున్న మూడో టెస్ట్‌లో ఓ క్యాచ్ అందుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 299 క్యాచ్‌లు అందుకున్నాడు. మరో క్యాచ్ అందుకుంటే 300 క్యాచ్‌ల క్లబ్‌లో చేరుతాడు. ఈ ఘనతను అందుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డు కెక్కుతాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక్కడే భారత్‌ నుంచి 334 క్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆరో ప్లేయర్‌గా..

ఆరో ప్లేయర్‌గా..

509 మ్యాచ్‌ల్లో ద్రవిడ్ ఈ ఫీట్ సాధించాడు. కోహ్లీ మాత్రం 492 మ్యాచ్‌ల్లో 299 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు అందుకున్న జాబితాలో ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. శ్రీలంక దిగ్గజ ప్లేయర్ మహేళ జయవర్దనే 440 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్(364), రాస్ టేల్(351), జాక్వస్ కల్లీస్(338) ద్రవిడ్ కంటే ముందున్నారు.

ఈ తరం ఆటగాళ్లలో ఒక్కరు కూడా కోహ్లీకి సమీపంగా లేకపోవడం గమనార్హం. బెస్ట్ ఫీల్డర్ అయిన కోహ్లీ..ఈ మధ్య స్లిప్‌లో క్యాచ్‌లు చేజారుస్తున్నాడు. లేకుంటే ఇప్పటికే ఈ క్లబ్‌లో చేరేవాడు.

ఐదో ప్లేయర్‌గా..

ఐదో ప్లేయర్‌గా..

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌లో కోహ్లీ మరో 77 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో సొంతగడ్డపై 4వేల పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. ఇప్పటి వరకు నలుగురు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తే ఐదో ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు. ఈ జాబితాలో 7,216 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్(5,598), సునీల్ గవాస్కర్(5067), వీరేంద్ర సెహ్వాగ్(4,656) కోహ్లీ కన్నా ముందున్నారు.

ఢిల్లీ టెస్ట్‌లోనే అన్ని ఫార్మాట్లలో కలిపి 25 వేల పరుగుల మైలు రాయి అందుకున్న కోహ్లీ.. ఇండోర్‌లో కూడా రెండు ఘనతలను అందుకుంటాని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సెంచరీ లేక మూడేళ్లు..

సెంచరీ లేక మూడేళ్లు..

2019లో బంగ్లాదేశ్‌తో డేనైట్ టెస్ట్‌లో చివరిసారిగా సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో శతకాన్ని నమోదు చేయలేకపోయాడు. గతేడాది ఆసియాకప్‌లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం ఇంకా తడబడుతున్నాడు.

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో విఫలమైన కోహ్లీ.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 12, 44, 20 పరుగులతో విఫలమయ్యాడు. ఢిల్లీ టెస్ట్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీని దురదృష్టం వెంటాడింది.

అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వడంతో భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం చేజారింది. ఇండోర్ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లోనై కోహ్లీ చెలరేగుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Story first published: Tuesday, February 28, 2023, 17:12 [IST]
Other articles published on Feb 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+