Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: నిప్పులు చెరిగిన నితీష్ రెడ్డి.. నిరాశపర్చిన కోహ్లీ, పంత్!

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో క్లీన్ స్వీప్‌కు గురైన టీమిండియా.. బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా 4-0తో సాధించాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కుతోంది. అంతేకాకుండా టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్‌ గంభీర్‌కు ఆస్ట్రేలియా పర్యటన ఇజ్జత్‌కే సవాల్‌గా మారింది.

IND vs AUS Virat Kohli And Rishabh Pant Disappointing in Simulation Match ahead of BGT

ఈ పర్యటనలో భారత్ రాణించకపోతే.. అతనిపై వేటు పడుతుందనే వార్తలు కూడా వచ్చాయి. న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన ఓటమిపై బీసీసీఐ కన్నెర్ర చేసిందని, రోహిత్ శర్మతో పాటు గౌతమ్ గంభీర్‌తో సమీక్ష నిర్వహించినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గంభీర్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్, కోహ్లీ, రాహుల్‌లకు అగ్ని పరీక్షగా మారింది.

పెర్త్ మైదానం సమీపంలోని వాకా స్టేడియంలో భారత్ తీవ్రంగా శ్రమిస్తోంది. భారత్-ఏ జట్టుతో శుక్రవారం టీమిండియా వామప్ మ్యాచ్‌‌ ఆడింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు, బౌలర్లుగా రెండు జట్లుగా వీడదీసి ఆడించారు. ఈ సిముల్యేషన్ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశపరిచారు.

భారత బౌలర్ల పేస్, బౌన్స్‌కు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. విరాట్ కోహ్లీ 15 పరుగులకే వెనుదిరగ్గా.. రిషభ్ పంత్ 19 పరుగులకే ఔటయ్యాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా 15 పరుగులకే వెనుదిరిగాడు. కళాత్మకమైన కవర్ డ్రైవ్‌తో ఆకట్టుకున్న కోహ్లీ.. ఆ వెంటనే పెవిలియన్ చేరాడు.
దూకుడుగా ఆడిన పంత్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లపై బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా ముఖేష్ కుమార్, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్‌తో నిప్పులు చెరిగారు. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ మాత్రం తడబడ్డాడు.

సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు. దాంతో లంచ్ సమయంలో ప్రసిద్ కృష్ణతో జస్‌ప్రీత్ బుమ్రా చాలా సేపు మాట్లాడాడు. గంభీర్ కూడా అతనితో చర్చించాడు. ఔటైన వెంటనే కోహ్లీ, జైస్వాల్ నెట్స్‌లోకి వెళ్లి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఆస్ట్రేలియా పిచ్ కండిషన్స్‌‌కు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Story first published: Friday, November 15, 2024, 18:02 [IST]
Other articles published on Nov 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+