మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు..
పేలవ ఫామో లేక మరే కారణమో తెలియదు కానీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి శనివారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లోని మహాకాలేశ్వర్ ఆలయాన్ని సందర్చించాడు. సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే శివుడికి భస్మా హారతి ఇస్తారు. ఈ కార్యక్రమంలో కోహ్లీ-అనుష్క దంపతులు పాల్గొన్నారు. నవ్రగ్రహాల పూజ కూడా చేసిన ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అహ్మదాబాద్ టెస్ట్‌లోనైనా పరుగులు చేసే అవకాశం కల్పించాలని ఆ దేవుడిని కోహ్లీ కోరుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
దేవుడిని ప్రార్థించేందుకు..
ఆ దేవుడి ప్రార్థించేందుకు మహాకాలేశ్వర్ వచ్చామని, దర్శనం బాగా జరిగిందని మీడియాకు అనుష్క తెలిపింది. ఇండోర్ టెస్ట్ ప్రారంభానికి ముందు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా సతీ సమేతంగా మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశాడు. కానీ పేలవ ఫామ్‌తో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. ఈ మధ్య కోహ్లీ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు. సయమం దొరికితే ఏదో టెంపుల్‌ను దర్శించడంతో పాటు స్వామిజీల ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే.

సెంచరీ లేక మూడేళ్లు..
టెస్ట్ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయక మూడేళ్లు అవుతోంది. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్ టెస్ట్‌లో విరాట్ చివరిసారిగా సెంచరీ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ శతకాన్ని అందుకోలేదు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో అయితే హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో 20, 1, 19 నాటౌట్, 24, 1, 12, 44, 20, 22, 13 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... చివరిగా సౌతాఫ్రికా టూర్‌లో కేప్‌టౌన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు చేశాడు. అతని సగటు కూడా దారుణంగా ఉంది. అహ్మదాబాద్ టెస్ట్‌లో విరాట్ కోహ్లీ తప్పనిసరిగా రాణించాలి. లేకుంటే ఈ వైఫల్యం అతని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ప్రభావం చూపుతోంది.

Click it and Unblock the Notifications