Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఉస్మాన్ ఖవాజా కళ్లు చెదిరే క్యాచ్.. ఆసీస్ ఉచ్చులో చిక్కుకున్న శ్రేయస్ అయ్యర్! (వీడియో)

IND vs AUS: Usman Khawaja takes stunning catch to dismiss Shreyas Iyer in Indore Test

ఇండోర్: ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఖవాజా తన ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. ఖవాజా స్టన్నింగ్ క్యాచ్‌కు శ్రేయస్ అయ్యర్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) బలయ్యాడు. టర్నింగ్ ట్రాక్‌పై బ్యాటర్లంతా ఇబ్బంది పడుతున్న వేళ అయ్యర్ అదరగొట్టాడు. భారీ షాట్లతో ఆసీస్ స్పిన్నర్లను చెడుగుడు ఆడాడు. ప్రమాదకరంగా మారిన అయ్యర్‌ను ఔట్ చేసేందుకు స్మిత్.. మిచెల్ స్టార్క్‌ను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు.

స్పిన్‌ను స్వేచ్చగా ఆడుతున్న అయ్యర్‌ను షాట్ పిచ్ బాల్‌తో దెబ్బతీస్తారని అంతా అనుకున్నారు. కానీ ఫుల్ బాల్‌‌కే అయ్యర్ ఔటయ్యాడు. స్టార్ వేసిన ఫుల్ బాల్‌ను శ్రేయస్ ఫ్లిక్ షాట్ ఆడగా.. ఫార్వార్డ్ ఫీల్డర్‌గా ఉన్న ఉస్మాన్ ఖవాజా సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌పై కాస్త సందేహంగా కనిపించడంతో ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఔటిస్తూ సమీక్ష కోరాడు. రిప్లేలో క్లీన్ క్యాచ్‌గా తేలడంతో శ్రేయస్ అయ్యర్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 35 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్‌లో జోరు కనబర్చిన అయ్యర్.. ఆసీస్ వ్యూహాన్ని పసిగట్టలేక స్మిత్ ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కేఎస్ భరత్ కూడా నిరాశ పరిచాడు.

156/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా.. అశ్విన్(3/44), ఉమేశ్ యాదవ్(3/12) ధాటికి 197 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఆసీస్‌కు 89 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

రోహిత్ శర్మ(33 బంతుల్లో 12)తో పాటు శుభ్‌మన్ గిల్(5), విరాట్ కోహ్లీ(13), రవీంద్ర జడేజా(7), శ్రీకర్ భరత్(3) దారుణంగా విఫలమయ్యారు. అయ్యర్ ధాటిగా ఆడినా.. ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. చతేశ్వర్ పుజారా(46 బ్యాటింగ్) రాణిస్తుండగా.. అశ్విన్(2 బ్యాటింగ్) అతనికి జత కలిసాడు.

Story first published: Thursday, March 2, 2023, 15:36 [IST]
Other articles published on Mar 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+