Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: రోహిత్ శర్మపై ప్రేమ.. కోహ్లీపై వివక్ష.. అంపైర్ నితిన్ మీనన్‌ తప్పిదాలపై ఫ్యాన్స్ ఫైర్!

 IND vs AUS: Umpire Nitin Menon trolled for being biased towards Virat Kohli, saving Rohit Sharma

న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైఫల్యం కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ ఎల్బీ విషయంలో వివాదాస్పద నిర్ణయం తీసుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నితిన్ మీనన్.. ఇండోర్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్ట్‌లోనూ తన పేలవ అంపైరింగ్‌ను కొనసాగించాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే తన చెత్త అంపైరింగ్‌తో రోహిత్ శర్మను సేవ్ చేశాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఫస్ట్ ఓవర్ తొలి బంతికే రోహిత్.. కీపర్ క్యాచ్ ఇవ్వగా అంపైర్ నితీన్ మీనన్ ఔటివ్వలేదు. ఆసీస్ అప్పీల్ చేసినా పట్టించుకోలేదు. ఫస్ట్ బాల్‌కు రివ్యూ ఎందుకనుకున్నారో ఏమో కానీ స్మిత్ సమీక్ష కోరలేదు. కానీ రిప్లే‌లో.. బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.

నితిన్ మీనన్ తప్పిదంతో రెండు సార్లు..

అదే ఓవర్ నాలుగో బంతికి ఎల్బీ కోసం ఆసీస్ అప్పీల్ చేయగా నితిన్ మీనన్ ఔటివ్వలేదు. బంతి బౌన్స్ అయిందనే భావనతో స్మిత్ రివ్యూ తీసుకోలేదు. కానీ రిప్లేలో బాల్ ట్రాకింగ్‌ను పరిశీలించగా.. స్టంప్స్‌ను తాకినట్లు స్పష్టమైంది. అంపైన్ నితిన్ మీనన్ తప్పిదంతో పాటు ఆసీస్ రివ్యూ తీసుకోకపోవడంతో రోహిత్ శర్మకు తొలి ఓవర్‌లోనే రెండు అవకాశాలు లభించాయి. కానీ ఆ అవకాశాలను రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. నిర్లక్ష్యపు షాట్‌తో వెనుదిరిగాడు. జడేజా వికెట్ విషయంలో బంతి బ్యాట్‌కు తాకినా ఎల్బీగా నితీన్ వికెట్ ఇచ్చాడు. కానీ జడేజా రివ్యూతో సేవ్ అయ్యాడు.

కోహ్లీ విషయంలో మాత్రం..

ఇక ఢిల్లీ టెస్టులో అంపైర్ నితిన్ మీనన్ తప్పిదంతో కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ప్యాడ్, బ్యాట్‌ను బంతి ఏక కాలంలో తాకినా అంపైర్ ఔటిచ్చాడు. ఫీల్డ్ అంపైర్‌కు కట్టుబడి థర్డ్ అంపైర్ ఔటివ్వడంపై తీవ్ర దుమారం రేగింది. చెత్త అంపైరింగ్ అంటూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. అప్పుడు కోహ్లీ విషయంలో తప్పుడు నిర్ణయంతో ఔట్ ఇచ్చిన నితిన్ మీనన్.. తాజాగా తన తప్పుడు నిర్ణయాలతో రోహిత్‌‌ను రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడేయటంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ముంబై ఇండియన్స్ అంపైరంటూ..

కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఔటిచ్చే నితిన్ మీనన్‌.. రోహిత్‌కు మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా ఉండేందుకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నాడు. నితిన్ మీనన్‌.. ముంబై ఇండియన్స్‌కు అమ్ముడుపోయాడని, చాలా సందర్భాల్లో వారికి అనుకూలంగా నిర్ణయాలు ప్రకటించాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అతన్ని అంపైరింగ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆధిక్యంలో ఆసీస్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 33.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. శుభ్‌మన్ గిల్(18 బంతుల్లో 3 ఫోర్లతో 21), విరాట్ కోహ్లీ(52 బంతుల్లో 2 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బ్యాటర్లలో కోహ్లీ ఒక్కడే 50 బంతులు ఆడటం గమనార్హం. ఆసీస్ స్పిన్నర్లలో మాథ్యూ కుహ్నేమన్(5/16) ఐదు వికెట్లతో చెలరేగగా..నాథన్ లయన్(3/35) మూడు వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 54 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఉస్మాన్ ఖవాజా(147 బంతుల్లో 4 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Wednesday, March 1, 2023, 19:44 [IST]
Other articles published on Mar 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+