Jitesh Sharma: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ క్షమాపణలు చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
టీమిండియా బ్యాటింగ్ సందర్భంగా క్రీస్ గ్రీన్ వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన జితేశ్ శర్మ.. పుల్ టాస్‌గా వచ్చిన మూడో బంతిని స్ట్రైట్‌గా బలంగా కొట్టాడు. దాంతో బంతి క్రీస్ గ్రీన్ వైపు వేగంగా దూసుకురాగా.. అతను క్యాచ్ అందుకోలేకపోయాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్‌కు బలంగా తాకింది.

అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ అంపైర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే బాల్ తగిలిన తర్వాత అంపైర్ అనంతపద్మనాభన్ జితేష్ శర్మ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. బంతి అంపైర్‌కు తగలకపోయి ఉంటే నేరుగా బౌండరీకి వెళ్లేది. దాంతోనే అంపైర్ అనంతపద్మనాభన్ జితేష్ శర్మకు క్షమాపణలు చెప్పినట్లు అర్థమవుతోంది.
జితేష్ శర్మ షాట్‌తో అంపైర్ అప్రమత్తమైనప్పటికీ క్రీస్ గ్రీన్ కారణంగా అతనికి బంతి తగిలింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(3/40) మూడు వికెట్లు తీయగా.. జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీకి ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31), మాథ్యూ వేడ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు తలో వికెట్ దక్కింది.
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది.