Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఓయ్.. పుజారా, రాహుల్.. రిటైర్మెంట్ ప్రకటించండి! మీకు.. మీ జిడ్డు బ్యాటింగ్‌కు ఓ దండం!

IND vs AUS: Twitter trolls KL Rahul and Cheteshwar Pujara for poor performance in Delhi test

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్‌లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరికి వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని మండిపడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. తొలి టెస్ట్‌లో రాణించకపోయినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ ఇద్దరికీ అవకాశం ఇచ్చింది.

కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతను వరుసగా విఫలమవుతున్నా.. కెప్టెన్, కోచ్ అండదండలతో జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. వైస్ కెప్టెన్సీ కూడా అతనికి రక్షణగా మారింది.

పేలవ ఫామ్ కంటిన్యూ..

రెండో టెస్ట్‌లోనూ ఒత్తిడిలోనే ఆడిన రాహుల్.. ఓ భారీ సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ తన టెక్నిక్ లోపంతో మరోసారి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో డిఫెన్స్ చేసే ప్రయత్నంలో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరోవైపు కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడుతున్న చతేశ్వర్ పుజారా డకౌటయ్యాడు.

ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయిన పుజారా.. ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదంతో పాటు ఆస్ట్రేలియా రివ్యూ తీసుకోకపోవడంతో బచాయించాడు. కానీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. నాథన్ లయన్ వేసిన మరుసటి ఓవర్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ ఔటివ్వకపోయినా.. ఆసీస్ రివ్యూ తీసుకొని ఫలితం సాధించింది.

జట్టుకు భారంగా..

ఈ ఇద్దరి వైఫల్యం టీమిండియా బ్యాటర్లపై ఒత్తిడిని పెంచింది. క్రీజులో సెట్ అయిన రోహిత్ సైతం వీరి కారణంగానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ స్వేచ్చగా ఆడలేకపోయాడు. ప్రస్తుతం క్రీజులో ఉన్న కోహ్లీ, జడేజా సైతం ఆచితూచి ఆడుతున్నారు. వెనువెంటనే వికెట్లు కోల్పోవడం బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్, పుజారాలపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ ఇద్దరి కోసం సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌లను పక్కనపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిటైర్మెంట్ ప్రకటించాలి..

పుజారా, రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించాలని, లేకుంటే వారిపై టీమ్‌మేనేజ్‌మెంట్ వేటు వేయాలని కోరుతున్నారు. కాలం చెల్లిన బ్యాటింగ్‌తో జట్టుకు భారంగా మారారని, వీరి కారణంగా ప్రతిభ కలిగిన శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌కు నష్టం జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

కపిల్ దేవ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టాలని సూచిస్తున్నా.. రాహుల్ ద్రవిడ్ వినడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోచ్‌గా ఉండి ద్రవిడ్ జట్టును నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేని శ్రేయస్ అయ్యర్‌ను నేరుగా ఆడించడాన్ని కూడా తప్పుబడుతున్నారు.

కష్టాల్లో భారత్..

21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. నాథన్ లయన్ దెబ్బకు పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి సెషన్‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో సెట్ అయిన కెప్టెన్ రోహిత్(32)‌తో పాటు కేఎల్ రాహుల్(17), పుజారా(0), శ్రేయస్ అయ్యర్(4) దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా నిదానంగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో టీమిండియా 88/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

Story first published: Saturday, February 18, 2023, 11:46 [IST]
Other articles published on Feb 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+