IND vs AUS: రనౌట్ విషయంలో దినేశ్ కార్తీక్ తప్పిదం.. నెట్టింట పేలుతున్న సెటైర్లు!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 ముందు ఆస్ట్రేలియాతో సన్నాహకంగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఓడి తీవ్రంగా నిరాశపర్చిన రోహిత్ సేన.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టింది.
దాంతో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే ఆఖర్ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ చేసిన రనౌట్‌పై వివాదం నెలకొంది. అక్షర్ పటేల్ సూపర్ త్రోకు గ్లేన్ మ్యాక్స్‌వెల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ రనౌట్ చేసే విషయంలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తప్పిదం చేశాడు. బంతి రాకముందే వికెట్లను గిరాటేసాడు. దాంతో ఈ నాటౌట్ అంటూ కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతిని మ్యాక్స్‌వెల్ క్విక్ డబుల్‌కు ప్రయత్నించాడు. అతను ఆడిన షాట్ లెగ్‌సైడ్ బౌండరీ లైన్ వద్దకు వెళ్లింది. అప్పటికే సింగిల్ తీసిన మ్యాక్సీవెల్ కాసేపు ఆగి డబుల్‌కు ప్రయత్నించాడు. కానీ బంతిని అందుకున్న అక్షర్ పటేల్ వేగంగా విసిరాడు.ఆ బంతిని అందుకున్న డీకే.. మ్యాక్సీని రనౌట్ చేశాడు.
ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ చిన్న తప్పిదం చేశాడు. బంతి తన చేతుల్లోకి రాక ముందే డీకే వికెట్లను తాకించాడు. కానీ థర్డ్ అంపైర్ పరిశీలించి ఔటిచ్చాడు. చేతిలో బంతి లేకుండా డీకే వికెట్లను తాకించినప్పటికీ.. లక్కీగా ఒక బెయిల్ మాత్రమే కింద పడింది. మరో బెయిల్ వికెట్లను తాకిన తర్వాత కింద పడింది. దాంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయంతో మ్యాక్స్‌వెల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ విషయంలోనే అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కిస్ పెట్టిన రోహిత్..
ఈ ఔట్ అనంతరం రోహిత్.. దినేశ్ కార్తీక్‌ను మెచ్చుకుంటూ అతనికి కిచ్ ఇచ్చాడు. ముందుగా దినేష్ కార్తీక్ ముందే గ్లోవ్స్ వికెట్ల తాకించడంపై కాస్త సీరియస్ అయినట్లు కన్పించినా.. తర్వాత ఔట్ అని స్టేడియం డిస్ ప్లేపై కన్పించగానే వెంటనే నవ్వుకుంటూ వచ్చి డీకే హెల్మెట్ ముద్దాడాడు. రిప్లేలో ఈ విజువల్ కన్పించడం ఆసక్తికరంగా అన్పించింది. ఇక మ్యాచ్‌లో రవీంద్రా జడేజా లేని లోటును అక్షర్ పటేల్ అటు బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో దాదాపుగా భర్తీ చేస్తున్నాడు.
అప్పడు పీకపట్టి..
ఇక రోహిత్ కిస్ పెట్టడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అప్పడు పీకపట్టిన రోహిత్.. ఇప్పుడు కిస్ పెట్టాడని ఒకరంటే.. అది ఔట్ కాకుంటే డీకేకు ముద్దులు కాదు.. గుద్దులు ఉండేవని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. ఇక కార్తీక్ తన తొందరపాటు అందర్నీ వణికించాడని ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. రెండు గ్లోవ్స్ పడుంటే.. కార్తీక్ బంతిని అందుకొని ఒక వికెట్ లేపాల్సి ఉండేది. అదే జరిగితే అప్పటికే మ్యాక్సీ క్రీజు చేరేవాడని, లక్కీగా బెయిల్ పడలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
దుమ్మురేపిన సూర్య
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), టీమ్ డేవిడ్(27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిర్సర్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. డానియల్ సామ్స్(28 నాటౌట్) కీలక పరుగులు చేశారు. అనంతరం సూర్య, కోహ్లీ(48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) పాటు చివర్లో హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25 నాటౌట్) సత్తా చాటడంతో టీమిండియా 19.5 ఓవర్లలో 187/4 స్కోర్ చేసి విజయాన్నందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications